Site icon NTV Telugu

KV Ramanachari: మన ఆయుర్వేదం ప్రపంచమంతటా విస్తరించడం ఆనందదాయకం

Nara

Nara

KV Ramanachari:ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలనే సంకల్పంతో నెలకొల్పిన అందరికి ఆయుర్వేదం సంస్థ ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక, కల్చరల్ గౌరవ సలహాదారులు డా.కేవీ రమణచారి. మంగళవారం హైదరాబాద్‌లో ఏల్చూరి ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ వేడుకకు యంగ్ హీరోస్ నారా రోహిత్, శ్రీ విష్ణు అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డా.కేవీ రమణచారి మాట్లాడుతూ.. ” డా.ఏల్చూరి ఆయుర్వేద వారసత్వాన్ని ఆయన తనయుడు డా.రాజా రంజిత్ కొనసాగించడం, ఆయుర్వేద ప్రాముఖ్యతను ప్రపంచమంతటా చాటిచెప్పాలనే సంకల్పంతో ముందుకు సాగడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంస్థ మూడు పువ్వులు ,ఆరు కాయలుగా వెలిగిపోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.

ఇక హీరోలు నారా రోహిత్, శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ” ఈ సంస్థ గొప్ప ఆశయంతో ముందుకుపోవడం ఆనందంగా వుందని, ఆయుర్వేద గొప్పతనం ప్రపంచమంతటా తెలియజేయడం కోసం ఈ సంస్థ నడుం బిగించడం గొప్ప విషయమని తెలిపారు. సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ డా.రాజా రంజిత్ మాట్లాడుతూ.. “అందరూ బాగుండాలి.. అందులో మనం వుండాలి అనే నాన్న గారి మాటల స్ఫూర్తితో ఆయన బాటలో భాగంగా ఆయుర్వేదంను ఇతర దేశాల్లో కూడా విస్తరించాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాను. నాకు తోడుగా వినయ్ గారి ప్రోత్సాహంతో ఇండియాలో ఏల్చూరి స్టోర్స్‌తో పాటు, వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం” అన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ బద్రినాథ్, సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వినయ్, రూపేష్ ఫణి సాయిరాం, డా.రాజా రంజిత్‌లతో పాటు సురేందర్, మూర్తి, కూర విశ్వనాథ్, డా.జ్ఞానేశ్వరి, డా.వైదేహి తదితరులు పాల్గొన్నారు

Exit mobile version