NTV Telugu Site icon

Raviteja: ఎక్ ధమ్ నచ్చేసావే అంటూ ప్రేమలు పాఠాలు చెప్తున్న గజదొంగ

Raviteja

Raviteja

మాస్ మహారాజ రవితేజ రీజనల్ మార్కెట్ ని క్రాస్ చేసి కెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమా చేస్తున్నాడు. వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్న రవితేజ పాన్ ఇండియా హిట్ కొడతాడు అనే నమ్మకం అందరిలోనూ ఉంది. దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్న టైగర్ నాగేశ్వర రావు సినిమా ప్రమోషన్స్ ని స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ తో టైగర్ నాగేశ్వర రావు సినిమాపై అంచనాలని మరింత పెంచిన మేకర్స్… లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేయడానికి రెడీ అయ్యారు. మేకర్స్ టైగర్ నాగేశ్వర రావు సినిమా నుంచి ‘ఏక్ ధమ్’ అనే సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు.

సెప్టెంబర్ 5న సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నాం అంటూ మేకర్స్… ఈ సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. ఈ ప్రోమోలో రవితేజ లుక్ చూస్తుంటే ఇది ప్రెజెంట్ లో జరిగే సాంగ్ లా ఉంది. ఏక్ ధమ్… ఏక్ ధమ్ నచ్చేసావే అంటూ సాగే ఈ పాటకి లిరిక్స్ భాస్కరభట్ల రాయగా, వోకల్స్ అనురాగ్ కులకర్ణి ఇచ్చాడు. వినగానే హమ్ చేసే జోష్ ఉన్న సాంగ్ కాబట్టి ఇమ్మిడియట్ గా బజ్ జనరేట్ చేస్తుంది. ప్రోమోతో ఇంప్రెస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఫుల్ సాంగ్ తో ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి. యాక్షన్ మోడ్ నుంచి లవ్ మోడ్ కి షిఫ్ట్ అయ్యి ఈ సాంగ్ తో టైగర్ నాగేశ్వర రావు టీమ్ ఎంతవరకూ అట్రాక్ట్ చేస్తారో చూడాలి.

Show comments