Eesha Rebba Comments on Love Breakups and Past Relations: తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే పలు సినిమాలు చేసింది. అయితే అవి వర్కౌట్ కాకపోవడంతో సెకండ్ హీరోయిన్గా కూడా అవకాశం వస్తే చేయడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. అలా అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాలో ఎన్టీఆర్ సరసన సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. ఆమె అటు అభినయంతో పాటు అందం విషయంలో కూడా ఏమాత్రం తక్కువ కాకపోయినా తెలుగు అమ్మాయి అనే ట్యాగ్ వల్ల ఏమో కానీ అవకాశాలు తక్కువగానే వస్తున్నాయి. తాజాగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లవ్ రిలేషన్స్ గురించి పాస్ట్ బ్రేకప్స్ గురించి ఓపెన్ అయింది.
Actor Chandu: కరాటే కళ్యాణితో నటుడు చందు చివరి వాట్సప్ ఛాట్!!!
ఇండస్ట్రీలో హీరోయిన్లకి పెళ్లిళ్లు ఎందుకు త్వరగా అవ్వవు అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె తాను ఎదుర్కొన్న పరిస్థితులను, రిలేషన్ షిప్స్ గురించి, పెళ్లి గురించి తన ఒపీనియన్స్ ఆమె చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుంటానంటే మ్యాట్రిమోనీలో పెడతానని మా నాన్న అన్నారు, అయితే వినడానికి క్యూట్ గా ఉంది కానీ అది వర్కౌట్ కాదని చెప్పానని ఆమె పేర్కొంది. మిగతా ఉద్యోగాలు, వృత్తులలో ఉన్న వారిని పెళ్లి చేసుకున్నట్టు ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం కుదరదని, వారిని అర్థం చేసుకోవడం కలిసి ట్రావెల్ చేయడం, భరోసా ఇవ్వడం లాంటి విషయాలు చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చింది. గతంలో తాను రిలేషన్స్ లో లేనని చెబితే అది అబద్దమే, రిలేషన్స్ లో ఉన్నా కానీ అవి రాంగ్ రిలేషన్స్ అని తెలిసిందని ఆమె చెప్పుకొచ్చింది. ఎవరినైనా తొందరగా నమ్మేస్తాను తర్వాత వారితో ట్రావెల్ అయిన కొద్దీ వారు బయట ఎలా ఉంటారు? మనతో ఎలా ఉంటారో తెలుస్తుందని అప్పుడే వారిలో ఉన్న నిజ స్వరూపం బయటకు వస్తుందని చెప్పింది.
ఏది రాంగ్ ఏది రైట్ అనే విషయాలు ముందుగానే అర్థం అవుతాయి, రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తాయి కానీ వాటి నుంచి స్మూత్ గా ఎస్కేప్ కావడం చాలా కష్టమని ఆమె కామెంట్ చేసింది. తాను కూడా రాంగ్ రిలేషన్స్ లో ఉన్నానని అందుకే అవి వదిలేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. విడిపోవడానికి చిన్న చిన్న సమస్యలే రిలేషన్ లో ఉన్నప్పుడు పెద్దగా అనిపిస్తాయి, అవి బయటికి చెప్పలేనివి అని ఆమె కామెంట్ చేసింది. ఇక తన పాస్ట్ బ్రేకప్స్ కాస్త ఇబ్బందికరంగానే జరిగాయని, తన పార్ట్నర్స్ గురించి అసలు విషయం తెలిసి నెమ్మదిగా ఆలోచించుకుని వారి నుంచి బ్రేకప్ చెప్పుకున్నట్లు పేర్కొంది. తనకు పెళ్లి అంటే భయం అని ఆ పదం వింటనే భయమేస్తుందని ఆమె కామెంట్ చేసింది.