Site icon NTV Telugu

Ee Nagaraniki Emaindi: రీరిలీజులో రచ్చ రేపిన ఈ నగరానికి ఏమైంది కలెక్షన్స్

Ee Nagaraniki Emaind

Ee Nagaraniki Emaind

Ee Nagaraniki Emaindi Re Release Collections: ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నట్టు ఈ నగరానికి ఏమైంది అనే సినిమాని కూడా రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్సేన్, అభినవ్ గోమాతం, సాయి సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమాకి యూత్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి అందరి అంచనాలను దాటేసి అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ఎవరు కూడా ఈ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని ఊహించలేదు. ఇక ఈ సినిమా దాదాపుగా కోటి 78 లక్షల షేర్ వసూలు వసూలు చేసిందని అది అద్భుతమైన రేంజ్ కలెక్షన్స్ అని అంటున్నారు. ఈ సినిమా మొదటి రోజు రీ రిలీజ్ అయినప్పుడు కోటి 69 లక్షల గ్రాస్ వసూలు చేయగా తర్వాత రోజు నుంచి భారీగానే వసూళ్లు రాబట్టింది.

Samantha: ఇబ్బంది పెడుతున్న ఆ జబ్బు.. మళ్లీ ట్రీట్మెంట్‌కు సమంత?

మొత్తం రీ రిలీజ్ లో మూడు కోట్ల 34 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా నైజాం ప్రాంతంలో కోటి 84 లక్షల గ్రాస్, ఆంధ్ర సీడెడ్ ప్రాంతాల్లో కలిపి కోటి 50 లక్షల గ్రాస్ మొత్తం కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు కోట్ల 34 లక్షల గ్రాస్ వసూలు చేయడమే కాదు కర్ణాటక సహా మిగతా భారతదేశం అంతా కలిపి మరో 18 లక్షలు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 52 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లయింది. ఇక ఇప్పటివరకు రిలీజైన సినిమాలలో పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ఏడు కోట్ల 46 లక్షలు వసూలు చేస్తే సింహాద్రి సినిమా 4 కోట్ల 60 లక్షలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా ఏకంగా మూడు కోట్ల 52 లక్షలు వసూలు చేసి ఈ లిస్టులో మూడవ స్థానం దక్కించుకుంది.

Exit mobile version