విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నగరానికి ఏమైంది. పెళ్లి చూపులు సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా. 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ ఇప్పుడు ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. లైఫ్ అంటే నలుగురితో కలిసి, నాలుగు మంచి పనులు చేయడమే అనే కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రీ రిలీజ్ టైమ్ లో సూపర్ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
కాగా ఈ సినిమాకు సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. హీరో విశ్వక్ సేన్ కూడా ఈ నగరానికి ఏమైంది 2 చేయాలని ఉందని అనేక మార్లు ప్రకటించాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఈ నగరానికి ఏమైంది 2 ఉంటుందని ఆ మధ్య ప్రకటించాడు. ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ నగరానికి ఏమైంది 2 ను అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సిక్వెల్ ను సురేష్ బాబు తో పాటు ’35 చిన్న కథకాదు’ అనే చిత్రాన్ని నిర్మించిన సృజన్, సందీప్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీమ్ కన్యారాశి గ్యాంగ్ ఈ సారి వెండితెరపై చేయబోయే సందడి కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియెన్స్. ఈNఈ రిపీట్ పేరుతో వస్తున్న ఈ సీక్వెల్ కు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : Kayadu Lohar : ఒకే ఒక్క హిట్ తో కయాదు లోహర్ దశ తిరిగింది
