Site icon NTV Telugu

ED Attaches : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆస్తులు అటాచ్!

Jacar

Jacar

 

సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాడేజ్ కష్టాలు తీరలేదు. ఇటీవల ఆమెను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఓ కేసు విషయంలో సుదీర్ఘ సమయం విచారించింది. తాజాగా ఆమెకు చెందిన రూ. 7.27 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. రూ. 200 కోట్ల స్కామ్ లో సూత్రధారి అయిన సుకేశ్‌ చంద్రశేఖర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఊచలు లెక్కపెడుతున్నాడు. అతనితో సాన్నిహిత్యం ఉన్న శ్రీలంకకు చెందిన హీరోయిన్ జాక్విలిన్ ను ఈడీ అధికారులు పలు మార్లు ప్రశ్నించారు. తాజాగా ఆస్తులను అటాచ్ చేశారు. సుకేశ్‌ నుండి జాక్విలిన్ రూ. 5.71 కోట్ల విలువచేసే బహుమతులను తీసుకుందని ఈడీ విచారణలో తేలింది. మూడు డిజైనర్ బ్యాగ్స్, మల్టిపుల్ డైమండ్ జ్యూయలరీ సెట్, రెండు బ్రాస్లెట్స్, రూ. 52 లక్షల విలువ చేసే ఓ గుర్రాన్ని సుకేశ్ ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడని తెలిసింది. అయితే… సన్ టీవీ అధినేతగా తనకు సురేశ్ పరిచయమని, తన బంధువులకు అతను భారీ మొత్తంలో బహుమతులు ఇచ్చాడని, తనకు ఓ గుర్రంతో పాటు కూపర్ కార్ ను గిఫ్ట్ ఇచ్చాడని జాక్విలిన్ గతంలోనే ఈడీ అధికారులు తెలిపింది.

Exit mobile version