Site icon NTV Telugu

Amitabh Bachchan: బిగ్ బి బర్త్ డే స్పెషల్.. ‘ప్రాజెక్ట్ కె’ స్పెషల్ సర్ప్రైజ్

Big B

Big B

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ ఒక శిఖరం.. ఒక స్ఫూర్తి.. కష్టపడి పైకివచ్చిన వారందరికీ ఆదర్శం. ఒకప్పుడు తన గొంతును హేళన చేసి రిజెక్ట్ చేసినవారి చేతనే శభాష్ అని అనిపించుకున్న హీరో. బాలీవుడ్ కు బిగ్ బి గా మారిన అమితాబ్ నేటితో 80 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. 80 ఏళ్ల వయస్సులోనూ ఆయనలో అదే ఎనర్జీ. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అమితాబ్ టాలీవుడ్ లో ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తున్నాడు. ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

ఇక నేడు అమితాబ్ పుట్టినరోజు కావడంతో ప్రాజెక్ట్ కె సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఒక పోస్టర్ తో అమితాబ్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. ఇక పోస్టర్ లో పిడికిలి బిగించిన ఒక హ్యాండ్ ను చూపించారు. ” 5 దశాబ్దాలకు పైగా అలరించిన పవర్‌హౌస్! మీరు ఈసారి ఆవిష్కరించిన కొత్త అవతార్‌ను ప్రపంచానికి చూపించడానికి వేచి ఉండలేము. 80 కాదు మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఈ శక్తి ఎల్లప్పుడూ మీతో ఉండనివ్వండి.. మా వెనుక ఉన్న శక్తి మీరే బచ్చన్ సర్” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

Exit mobile version