NTV Telugu Site icon

The OG: ఇదెక్కడి ‘మాస్’ జోష్ బ్రో… OG కోసం ఏకంగా బిర్యానీలు పంపిస్తున్నావ్

Og

Og

డీవీవీ ఎంటర్టైన్మెంట్… ఈ బ్యానర్ లో ఇప్పటివరకూ శివమణి, దేశముదురు, జులాయి, భరత్ అనే నేను, నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పేరుని ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, బాలయ్య, రవితేజ, రామ్ చరణ్ తేజ్ లాంటి హీరోలతో సినిమాలని నిర్మించినా ఎప్పుడూ ప్రమోషన్స్ విషయంలో మాత్రం డీవీవీ ఎంటర్టైన్మెంట్ కాస్త బ్యాక్ స్టేజ్ లోనే ఉండేది. ఆర్ ఆర్ ఆర్ సమయంలో కూడా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ ల సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ట్వీట్స్ వస్తూనే ఉండేవి కానీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ నుంచి మాత్రం చాలా తక్కువగా వచ్చేవి. ఈసారి మాత్రం పవర్ స్టార్ గాలి సోకిందో, పవన్ అభిమానుల జోష్ అంటిందో తెలియదు కానీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ నెవర్ బోఫోర్ ఎనర్జీతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ డైరెక్షన్ లో ‘OG’ సినిమాని ఎప్పుడైతే అనౌన్స్ చేసారో అప్పటినుంచి DVV ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఫోటోస్, పోస్టర్స్, బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో DVV ఎంటర్టైన్మెంట్ హల్చల్ చేస్తోంది. పవన్ ఫాన్స్ ని ఖుషీ చెయ్యడం, OG సినిమాపై హైప్ పెంచడమే పనిగా పెట్టుకోవడమే DVV ఎంటర్టైన్మెంట్ పనిగా పెట్టుకున్నట్లు ఉంది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని క్లౌడ్ నైన్ లో ఉంచుతున్న DVV ఎంటర్టైన్మెంట్, రంజాన్ పండగ రోజున ఏకంగా బిర్యానీ పాకెట్స్ పంపిస్తోంది. రంజాన్ ఫెస్టివల్ విషెస్ చెప్తూ DVV ఎంటర్టైన్మెంట్ ఒక ట్వీట్ చేసింది. దీనికి ఒక ఫ్యాన్ “OG నుంచి బిర్యానీ ప్లాన్ చెయ్” అని రిప్లై ఇచ్చాడు. ఇది చూడగానే “ఓకే, DMలో అడ్రెస్ పంపించు… హ్యాపీ ఈద్” అంటూ DVV ఎంటర్టైన్మెంట్ నుంచి రిప్లై రావడంతో ఫాన్ ఖుషీ అయిపోయి ఉంటాడు. కాసేపటి తర్వాత ఆ ఫ్యాన్ “బిర్యానీ వచ్చింది, మా రూమ్ మేట్స్ ఎంజాయ్ చేస్తున్నారు” అంటూ ఫోటో ట్వీట్ చేసి ఫాన్స్ అందరికీ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. బిర్యానీతో పాటు డబుల్ కా మీటా కూడా పంపించిన DVV ఎంటర్టైన్మెంట్ కి కాంప్లిమెంట్స్ అందిస్తూ పవన్ ఫాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ‘OG’ ఓపెనింగ్ డే రోజు వేసుకున్న టీషర్ట్ కావాలని ఒకరు, మాకు కూడా ఎదో ఒకటి ఆర్డర్ పెట్టు అని ఇంకొకరు, మాకు అసలు ఏమీ వద్దు కానీ సినిమా బాగా చెయ్యండి అని మరొకరు… ఇలా DVV ఎంటర్టైన్మెంట్ ని ట్యాగ్ చేసి ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో DVV ఎంటర్టైన్మెంట్, ఫ్యాన్ కి మధ్య జరిగిన బిర్యానీ యవ్వారం వైరల్ అయ్యింది. ఇంతకీ ఆర్ ఆర్ ఆర్ సినిమా సమయంలో కూడా సైలెంట్ గానే సినిమాని ప్రమోట్ చేసిన DVV ఎంటర్టైన్మెంట్, OG విషయంలో మాత్రమే ఎందుకు ఇంత అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు అనేది అర్ధం కాని విషయంగా మారింది. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి ప్రమోట్ చేస్తున్నారులే అనుకుందాం అంటే… DVV ఎంటర్టైన్మెంట్ పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యడం ఇదే మొదటిసారి కాదు గతంలో గంగతో రాంబాబు సినిమాని ప్రొడ్యూస్ చేశారు, పైగా ఆ సినిమాకి పూరి దర్శకుడు. ఆ టైంలో కూడా DVV ఎంటర్టైన్మెంట్ ఇంత అగ్రెసివ్ ప్రమోషన్స్ కి వెళ్లలేదు. పవన్ సినిమాకి మాములుగానే హ్యూజ్ ఓపెనింగ్స్ వస్తాయి అలాంటిది DVV ఎంటర్టైన్మెంట్ ‘OG’ సినిమాని ఈ రేంజులో ప్రమోట్ చేస్తే ఇక బాక్సాఫీస్ దగ్గర సునామీ రావడం ఖాయం.