Dhurandhar 2 : దురంధర్ 2 బ్యాన్ చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో సినిమా సెగలు ఎప్పుడూ ఎక్కువే, తాజాగా ‘ధురంధర్ 2’ అనే సినిమా ఇప్పుడు న్యాయ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ‘ధురంధర్ 2’ సినిమాలో అభ్యంతరకర రాజకీయ అంశాలు ఉన్నాయని ఒక అడ్వకేట్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా ఓటర్ల తీర్పును ప్రభావితం చేసేలా ఉందని, అందుకే ఈ సినిమాను తక్షణమే నిషేధించాలని ఆయన తన అత్యవసర పిటిషన్‌లో పేర్కొన్నారు.
Also Read:Koratala Siva: అయ్యో ‘దేవర’.. టాప్ డైరెక్టర్‌కు దొరకని హీరోలు.. నిజమేనా?
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
సినిమాలో ఉన్న కొన్ని సన్నివేశాలు, డైలాగులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని పిటిషనర్ వాదించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలాంటి సినిమాల ప్రదర్శన వల్ల రాజకీయంగా ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ సినిమా విడుదలను లేదా ప్రదర్శనను నిలిపివేయడమే ఉత్తమమని కోర్టుకు విన్నవించారు. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ నేపథ్యంలో వచ్చే సినిమాలపై సెన్సార్ బోర్డుతో పాటు న్యాయస్థానాలు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుంటాయి. అయితే, ‘ధురంధర్ 2’ చిత్ర యూనిట్ మాత్రం ఇది కేవలం కల్పిత కథ అని, ఎవరినీ ఉద్దేశించి తీసినది కాదని వాదిస్తోంది. మద్రాస్ హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తుందా? లేదా సెన్సార్ బోర్డు నిర్ణయానికే వదిలేస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కోర్టు గనుక సినిమాపై స్టే విధిస్తే, అది నిర్మాతలకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..