Site icon NTV Telugu

Dunki: డ్రాప్ 2గా పాటని వదులుతున్నారు…

Dunki

Dunki

అయిదేళ్ల పాటు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023… బాలీవుడ్ గోల్డెన్ కి మళ్లీ తీసుకొని వచ్చింది, ఇందుకు మొదటి కారణం షారుఖ్ ఖాన్ మాత్రమే. తన పని అయిపొయింది అనే కామెంట్స్ వినిపిస్తున్న సమయంలో షారుఖ్ ఖాన్… 2023లో రెండు సినిమాలు రిలీజ్ చేసి రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టాడు. పఠాన్, జవాన్ సినిమాలు షారుఖ్ ని తిరిగి బాలీవుడ్ బాద్షాగా నిలబెట్టాయి. ఈసారి యాక్షన్ సినిమాలు కాదు ఫీల్ గుడ్ సినిమాతో రావడానికి రెడీ అవుతున్నాడు షారుఖ్ ఖాన్. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో డంకీ సినిమా చేస్తున్నాడు షారుఖ్. డిసెంబర్ 21న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాతో ఒకే ఏడాదిలో మూడు సార్లు వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన హీరోగా షారుఖ్ నిలుస్తాడని బాలీవుడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి.

రాజ్ కుమార్ హిరాణీపైన ఉన్న నమ్మకం డంకీ సినిమాపై అంచనాలని మరింత పెంచుతుంది. ఇల్లీగల్ మైగ్రేషన్ చుట్టూ తిరిగే ఎమోషనల్ కథతో రాజ్ కుమార్ హిరాణీ డంకీ సినిమాని తెరకెక్కించాడట. ఈ ఎమోషన్ వర్కౌట్ అయితే డంకీ సినిమా షారుఖ్ కెరీర్ లోనే కాదు బాలీవుడ్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్ అవ్వడం గ్యారెంటీ. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన డంకీ మేకర్స్… డ్రాప్ 1 అంటూ టీజర్ ని వదిలారు. ఇప్పుడు డ్రాప్ 2 అంటూ డంకీ నుంచి ‘లట్ పట్ గయా’ అనే సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. హీరోయిన్ తాప్సీ, షారుఖ్ పైన డిజైన్ చేసిన ఈ సాంగ్ డంకీ సినిమా ప్రమోషన్స్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుంది అనేది తెలియాలి అంటే సాంగ్ బయటకి వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version