Duet: బేబీ సినిమాతో స్టార్ హీరో గా మారిపోయాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఆనంద్. ఈ సినిమా తరువాత పలు సినిమాల్లో కనిపించినా ఆనంద్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఇక సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాతో ఆనంద్.. భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి మోసాన్ని తట్టుకోలేక.. తాగుబోతుగా మారిన ఆటో డ్రైవర్ గా ఆనంద్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టిన ఆనంద్.. ఇప్పటికే సాయి రాజేష్ అందిస్తున్న కథతో వస్తున్న మరో సినిమాలో మరోసారి వైష్ణవి చైతన్యతో జతకట్టాడు. ఇక ఇది కాకుండా తాజాగా మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు ఆనంద్.
Shakeela: నా కన్నతల్లే.. నన్ను వాళ్ల దగ్గర పడుకోబెట్టింది
మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డ్యూయెట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందులో ఆనంద్ సరసన రితికా నాయక్ నటిస్తోంది. ఇక స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ పూజా కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, సాయి రాజేష్, హరీష్ శంకర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. హరీష్ శంకర్ క్లాప్ కొత్తగా.. సాయి రాజేష్ స్క్రిప్ట్ ను అందించాడు. ఇక ఈ పోస్టర్ ను చూస్తే .. ఈ సినిమా కూడా నిబ్బానిబ్బిలా లవ్ స్టోరీలానే అనిపిస్తుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Moments of joy and celebration from #Duet Pooja Ceremony ✨
Shoot begins soon ✨@ananddeverkonda @RitikaNayak_@gvprakash @mithukrish12@GnanavelrajaKe @NehaGnanavel @madhurasreedhar @GskMedia_PR @digitallynow pic.twitter.com/f3MjcjRxwn
— Studio Green (@StudioGreen2) November 2, 2023