Producer Guild: టాలీవుడ్ నిర్మాతల గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకోనున్నదా అంటే నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.. అదేంటంటే.. టాలీవుడ్ ప్రస్తుతం వరుస సినిమాలతో కళకళలాడుతోంది. తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఇతడే ఇండస్ట్రీ హీరోలను కూడా ఆతెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సాధారణ సమయంలో అయితే ఎలాంటి సినిమాలు వచ్చినా పర్లేదు కానీ పండగల సమయంలో మాత్రం అన్ని సినిమాలకు థియేటర్స్ ఇవ్వడం అనేది కష్టతరంగా మారింది. ముఖ్యంగా సంక్రాంతి. తెలుగువారి అతిపెద్ద పండుగ.. ఈ పండుగను టాలీవుడ్ హీరోలతో పాటు అన్ని ఇండస్ట్రీల హీరోలు టార్గెట్ చేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని లేకుండా ప్రతి సినిమాను ప్రేక్షకుల ముందు ఉంచడానికి నిర్మాతలు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే థియేటర్లు లేక కొన్ని సినిమాలు, హిట్ టాక్ ను, కలెక్షన్స్ ను తెచ్చుకోలేకపోతున్నాయి అనేది నమ్మదగ్గ నిజం. దీంతో ఈసారి సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలను నిషేధించాలని గిల్డ్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.
సంక్రాంతి మూడు రోజులు తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్లను కేటాయించాలని చూస్తున్నారట. ఈ లెక్కన చూసుకొంటే మొదట నష్టపోయేది దిల్ రాజునే అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే దిల్ రాజు నిర్మాణంలోనే కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు తెరకెక్కుతోంది. డైరెక్టర్ తెలుగువాడు అయినా ఆ సినిమాను తమిళ్ లోనే తెరకెక్కిస్తున్నారు. బై లింగువల్ ఫిల్మ్ అంటే ఒప్పుకొని విజయ్.. డబ్బింగ్ సినిమా అని మొహమాటం లేకుండా చెప్పుకొచ్చాడు. దీంతో ఇది కూడా డబ్బింగ్ సినిమా కిందే లెక్క.. మరి డబ్బింగ్ సినిమాలు నిషేధిస్తే.. మొదట వారసుడే రాడు కదా అనేది అందరి అనుమానం. మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే ప్రొడ్యూసర్ గిల్డ్ నోరు విప్పక తప్పదు.
