Site icon NTV Telugu

డబ్బింగ్ లో సమంత ‘శాకుంతలం’

Shakunthalam Dubbing Starts

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. దిల్ రాజుతో కలిసి ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దీనిని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. శకుంతలగా సమంత నటిస్తుండగా, దుష్యంతుడి పాత్రను ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ పోషిస్తున్నారు. ఇక చిన్నారి భరతుడిగా అల్లు అర్జున్ కుమార్తే బేబీ అర్హ అలరించబోతోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పని ప్రస్తుతం జరుగుతోంది. సోమవారం నుండి డబ్బింగ్ ప్రారంభించినట్టు గుణ టీమ్ వర్క్స్ సంస్థ తెలిపింది. అతిధి బాలన్, మల్మోత్రా శివన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ తో కలిసి సాయిమాధవ్ బుర్ర సంభాషణలు రాశారు. శేఖర్ వి. జోసఫ్ సినిమాటోగ్రఫీ అందించారు. గ్రాఫిక్స్ హైలైట్ గా నిలిచే ‘శాకుంతలం’ పాన్ ఇండియా మూవీగా పలు భారతీయ భాషల్లో ఒకేసారి వచ్చే యేడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో జనం ముందుకు రానుంది.

Read Also : ముంబైలోనూ బొమ్మ పడబోతోంది!

Exit mobile version