NTV Telugu Site icon

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ.. ఇద్దరు టాలీవుడ్ నటుల బ్లడ్లో డ్రగ్స్?

Bengaluru Rave Party

Bengaluru Rave Party

Drugs Traces Found from Blood Samples of Hema and Aashi Roy: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇద్దరు టాలీవుడ్ నటులున్నట్టు తేలింది. నటి హేమతో పాటు నటి అషి రాయ్ లకు చేసిన డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ అని తేలింది. ఈ డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. హెబ్బగుడి పోలీస్ స్టేషన్ లో ఈ బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించిన విచారణ జరుపుతున్నారు అధికారులు. ఇక ఈ కేసులో A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్, A3 నాగబాబు, A4 రణధీర్ బాబు, A5 మహమ్మద్ అబూబాకర్, A6 గా గోపాల్ రెడ్డిని నమోదు చేయగా A7 గా 68 మంది యువకులు, A8 30 మంది యువతులను చేర్చారు. మొత్తంగా ఈ కేసులో 14.40 గ్రాముల MDMA పిల్స్, 1.16 గ్రామ్స్ MDMA క్రిస్టల్, 5 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

Actress Murdered: నటిని సుత్తితో కొట్టి చంపేశాడు.. మరీ ఇంత దారుణంగానా?

కొకైన్ తో పాటు 500 రూపాయల నోట్లు ఉన్నాయని, అవి పౌడర్ ను పీల్చేందుకు ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇక ఈ కేసులో 5 మొబైల్ ఫోన్స్, ఒక వోక్స్ వ్యాగన్ కారు, ల్యాండ్ రోవర్ కారు, కోటిన్నర డీజే ఎక్విప్మెంట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ పార్టీలో 73 మంది యువకులు పాల్గొనగా 59 మందికి పాజిటివ్ అని తేలింది. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే.. 86 మందికి డ్రగ్స్ ట్రెసెస్ పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది. ఈ పార్టీని ఆర్గనైజ్ చేసింది A2 అరుణ్ కుమార్ కాగా ఫామ్ హౌజ్ ని వాసు స్నేహితుడు గోపాల్ రెడ్డి బుక్ చేశాడు. ఇక A4 రణధీర్ కారులో డ్రగ్స్ లభ్యం కాగా మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.