Site icon NTV Telugu

Actor Arrested: నాలుగేళ్ల బాలిక రేప్ .. పోక్సో యాక్ట్ కింద ‘దృశ్యం’ నటుడు అరెస్ట్?

Crime

Crime

Drishyam Actor Kootickal Jayachandran Arrested: మలయాళ ‘దృశ్యం’తో పాటు పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్, విలన్‌లు పోషించిన మలయాళ నటుడు కూటికల్ జయచంద్రన్.. బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. మలయాళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఘటన జరిగిన రోజు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన బాలిక చాలాసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అయితే బాలిక దుస్తులు కాస్త చిరిగిపోయి, శరీరం దుమ్ము కొట్టుకు పోయి ఉండటాన్ని ఆమె బంధువులు గమనించారు. ఈ క్రమంలో కోజికోడ్ పోలీస్ స్టేషన్‌లో 4 ఏళ్ల చిన్నారిని వేధించినట్టు తల్లి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. నాలుగేళ్ల బాలికను వేధించాడంటూ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కసబా పోలీసులు నటుడిపై కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో జయచంద్రన్ తన కుమార్తెను చిత్రహింసలకు గురిచేశాడని ఫిర్యాదు చేసింది.

Charle Son Wedding: నటుడు చార్లీ పెళ్లి.. రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి

జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆదేశాల మేరకు పోలీసులు చిన్నారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసులు చిన్నారి ఇంటికి చేరుకుని వాంగ్మూలం నమోదు చేశారు. ఇక నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో నటుడు జోతుక్కల్ జయచంద్రన్‌ను పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలులో పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపింది. జయచంద్రను కఠినంగా శిక్షించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. వీరి స్వస్థలం పాలక్కాడ్ అయినప్పటికీ, కొంతకాలం నుంచి పొల్లాచ్చిలో నివసిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ అంశం మీద జయచంద్రన్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని నటుడిని ఇంకా అరెస్టు చేయలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ కేసులో మైనర్ ప్రమేయం ఉన్నందున మరింత సమాచారం వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. జయచంద్రన్ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు మరియు తరువాత, జగతి వర్సెస్ జగతి అలాగే కామెడీ టైమ్ వంటి కార్యక్రమాలతో ప్రముఖ అలాగే టెలివిజన్ వ్యాఖ్యాతగా ఎదిగారు. ఇక ఆయన దృశ్యంలో కీలక పాత్ర పోషించాడుదానితో పాటు, న్జాన్, ఒరు సెకండ్ క్లాస్ యాత్ర, లక్ష్యం, నారధన్, మై బాస్, డిటెక్టివ్ వంటి అనేక హిట్ సినిమాల్లో కూడా నటించాడు.

Exit mobile version