NTV Telugu Site icon

‘నారప్ప’ కన్నా ముందు ‘దృశ్యం-2’?

Drishyam 2’s release before than Narappa

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై బాగానే పడింది. సినిమా థియేటర్లు మూసివేశారు. షూటింగులు కూడా నిలిపివేయడంతో ఎంతోమంది సినీ కార్మికులకు పనే లేకుండా పోయింది. చాలా సినిమాల విడుదల వాయిదా పడింది. ఈ పరిస్థితుల్లో విక్టరీ వెంకటేష్ నటించిన రెండు సినిమాల విడుదల ప్లాన్స్ మారాయనే వార్త ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం-2 సినిమా షూటింగులు పూర్తయ్యాయి. దీంతో ఈ రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే “నారప్ప”నే మొదటగా విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు వెంకీ టీం కొన్ని బిజినెస్ లెక్కల కారణంగా “దృశ్యం-2″ను ముందుగా విడుదల చేయాలనీ భావిస్తున్నారట. దీనికి కారణం తెలియదు కాని ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. మరి వెంకీ మామ ప్లాన్ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.