NTV Telugu Site icon

Double Ismart: పూరీ-రామ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. ఆరోజు నుంచే రెగ్యులర్ షూట్?

Doule Ismart Movie Launch Date

Doule Ismart Movie Launch Date

Double Ismart Launch Date Fixed: విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచిన తర్వాత పూరీ జగన్నాథ్ చాలా సైలెంట్ అయిపోయారు. పూరీ జగన్నాథ్ ప్రస్తుతానికి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండతో చేయాల్సిన జనగణమన క్యాన్సిల్ కావడంతో రామ్ తో ఒక సినిమా చేయవచ్చు అంటూ ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. ఆ ప్రచారానికి ఊతం ఇస్తూ పూరి కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థ బాధ్యతలు చూసుకుంటున్న ఒకప్పటి హీరోయిన్ ఛార్మీ కూడా డబల్ ఇస్మార్ట్ పేరుతో సినిమా తెరకెక్కుతుందని అధికారికంగా ప్రకటించింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఏ రోజు జరగబోతున్నాయి అనే విషయం క్లారిటీ వచ్చేసింది.

Ranga Maarthaanda TRP: స్టార్ హీరోల సినిమాల టీఆర్పీ రేటింగ్స్‌ను మించిన రంగమార్తాండ!

ఈ నెల తొమ్మిదో తేదీ ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరగబోతున్నాయి, ఇక మూడు రోజుల తర్వాత నుంచి అంటే జూలై 12 వ తేదీ నుంచి పూరీ జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. పూరి, ఛార్మీ కౌర్ నిర్మాతలుగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయం మీద క్లారిటీ వచ్చింది కానీ హీరోయిన్ ఎవరు? ఇతర నటీనటులను ఫైనల్ చేశారా లేదా అనే విషయాన్ని మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. నిజానికి గతంలో వరుస ప్లాపులతో ఇబ్బంది పడ్డ పూరి జగన్నాథ్ రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టడమే కాదు అప్పులన్నీ క్లియర్ చేసేసుకున్నాడు. ఇక ఆ తర్వాత లైగర్ సినిమాతో మరో డిజాస్టర్ అందుకోగా ఇప్పుడు ఆ అప్పుల నుంచి బయట పడేందుకు రామ్ తో ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా పూరికి ఎంతవరకు కలిసి రాబోతుంది అనేది?

Show comments