NTV Telugu Site icon

Double Ismart: ఉస్తాద్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ షురూ అయ్యింది…

Double Ismart

Double Ismart

లైగర్ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్లీ తన మార్క్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. పూరి అంటే ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత స్పీడ్‌గా కిందకి పడిపోతాడో.. అంతకుమంచి డబుల్ ఫోర్స్‌తో పైకి వస్తాడు. అందుకే ఈసారి డబుల్ ఇస్మార్ట్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అది కూడా తన ఫార్మాట్‌లోనే రాబోతున్నాడు. లైగర్ కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించిన పూరి.. ఇప్పుడు సంవత్సరం లోపే సినిమా కంప్లీట్ చేసి ఆడియెన్స్ ముందుకి తీసుకురాబోతున్నాడు. ఇటీవలె ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అది కూడా రిలీజ్‌ డేట్‌తో సహా ప్రకటించాడు.

వచ్చే మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేయనున్నట్టు.. అనౌన్స్మెంట్ రోజే చెప్పేశాడు. దీంతో ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ ని చూడడానికి రామ్ పోతినేని ఫాన్స్ కూడా రెడీ అయ్యారు. పది రెడ్ బుల్స్ తాగిన ఎనర్జీని ఒక్క సినిమాతో ఇవ్వడానికి ప్రిపేర్ అవుతన్న ఈ కాంబినేషన్ ఎట్టకేలకు సినిమా లాంచ్ చేసింది. పూజా కార్యక్రమాల్ని పూర్తి చేసి జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తున్నట్టు చెప్పేసారు. జులైలో లాంఛనంగా మొదలుపెట్టి, ఈ ఏడాది చివరికల్లా షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడట పూరి. ఆ తర్వాత రెండు, మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని.. ఎట్టి పరిస్థితుల్లోను మార్చ్ 8న చెప్పిన డేట్ డబుల్ ఇస్మార్ట్ ని రిలీజ్ చేసేయాలని పూరి ప్లాన్ చేసాడని సమాచారం. ప్రస్తుతం రామ్, బోయపాటి శ్రీనుతో కలిసి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్కంద’ చేస్తున్నాడు. సెప్టెంబర్ 15న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ‘స్కంద’ పాన్ ఇండియా సినిమా కాబట్టి అది హిట్ అయితే డబుల్ ఇస్మార్ట్ కి మరింత మార్కెట్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ. ఈ మరి డబుల్ ఇస్మార్ట్‌తో పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి.