NTV Telugu Site icon

Double Ismart Heroine: హాట్ బ్యూటీ సెట్… పూరి టేస్ట్ అంటే మినిమమ్ ఉంటది

Double Ismart Shankar

Double Ismart Shankar

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేనితో కలిసి చేస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’. 2024 మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ముందుగానే అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసాడు పూరి జగన్నాథ్. పది రెడ్ బుల్స్ తాగిన ఎనర్జీని ఒక్క సినిమాతో ఇవ్వడానికి ప్రిపేర్ అవుతన్న ఈ కాంబినేషన్ రీసెంట్ గా ఫారిన్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని వచ్చింది. ఆ తర్వాత ముంబై షెడ్యూల్ ని కూడా పూర్తి చేసాడు పూరి. ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ కూడా షూటింగ్ జరిగిందని సమాచారం. రామ్ పోతినేనితో పాటు ఒక యంగ్ బ్యూటీతో సాంగ్ షూటింగ్ లో పాల్గొనింది.

ఇలియానా, నభా నటేష్, నిధి అగర్వాల్, ఆసిన్, అనుష్క, హన్సిక, అదా శర్మ… ఇలా పూరి సినిమాల్లో హీరోయిన్ ఎప్పుడూ చాలా స్పెషల్ గా యూత్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటారు. లేటెస్ట్ గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ కోసం కూడా పూరి అలాంటి హీరోయిన్ నే ఫిక్స్ చేసినట్లు ఉన్నాడు. హీరోయిన్ విషయంలో పూరి కనెక్ట్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ రాలేదు కానీ ముంబైలో జరిగిన షూటింగ్ షెడ్యూల్ లో రామ్ పోతినేనితో పాటు కావ్య థాపర్ కూడా సాంగ్ లో ఉందని టాక్. తెలుగు ఆడియన్స్ కి ‘ఏక్ మినీ కథ’ సినిమాతో పరిచయం అయిన ఈ నార్త్ బ్యూటీ… మొదటి సినిమాతోనే యూత్ ని మెప్పించింది. క్యూట్ గా కనిపిస్తూనే గ్లామర్ ట్రీట్ ఇవ్వగల కావ్య థాపర్ డబుల్ ఇస్మార్ శంకర్ సినిమాలో హీరోయిన్ అని మేకర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అనేది చూడాలి. ఇప్పటికైతే ఈ ఏడాది చివరికల్లా డబుల్ ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ పూర్తి చేయాలని ఫిక్స్ అయిపోయాడట పూరి.

Show comments