NTV Telugu Site icon

Naga Chaitanya: దూత గా భయపెట్టనున్న అక్కినేని నవ మన్మథుడు

dootha

dootha

అక్కినేని నాగ చైత్నన్య వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇప్పటికే బంగార్రాజు చిత్రంతో హిట్ ని అందుకున్న ఈ హీరో ప్రస్తుతం థాంక్యూ సినిమాను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు.. మరోపక్క హిందీలో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దాలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా అమెజాన్ ప్రైమ్ కోసం ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి దూత అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సిరీస్వి షూటింగ్ ని నేటినుంచి మొదలుపెట్టినట్లు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

బ్లాంక్ అండ్ వైట్ లో నాగ చైతన్య వెనుక ఉన్న స్క్రిప్ట్ ని చూపిస్తూ విక్రమ్ కె కుమార్.. దూత స్టార్ట్స్ అని తెలిపారు. బ్యాక్ నుంచి కూడా చైతూ లుక్ కొత్తగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నాగ చైతన్య హర్రర్ జోనర్ టచ్ చేసింది లేదు. మొదటిసారి ఈ జోనర్ లో ప్రేక్షకులను భయపెట్టనున్నాడు. మరి దూతతో ఓటిటీ ఎంట్రీ ఇస్తునానఁ అక్కినేని హీరో ఇక్కడ కూడా విజయాన్ని అందుకుంటాడా..? లేదా..? చూడాలి.