అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్రా. తెలుగులో వరుస సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ పరంగా సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. స్కిన్ షో కి తెరతీసి గ్లామర్ పాత్రలో నటించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది, దీంతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా అజిత్ హీరోగా నటించిన కోలివుడ్ చిత్రం ‘విడాముయర్చి’ లో ముఖ్య పాత్రలో కనిపించనుంది రెజీనా. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో, త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది రెజీనా. ఇందులో భాగంగా ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళ హీరో శివ కార్తికేయన్ గురించి రెజీనా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
Alsi Read:Brahmanandam: బ్రహ్మనందం ఇన్‌స్టా ఎంట్రీ..క్షణాలో పెరిగిపోయిన ఫాలోవర్స్
రెజీనా మాట్లాడుతూ.. ‘ శివకార్తికేయన్ ఇంత పెద్ద హీరో అవుతాడు అనుకోలేదు. ఎందుకు ఈ మాట అంటూన్నాను అంటే. నేను శివ కార్తికేయన్ ‘కెడి బిల్లా కిల్లాడి రంగా’ అనే సినిమాలో కలిసి నటించాం. ఈ మూవీ విడుదలై 12 ఏళ్లు అయ్యింది. అయితే, శివకార్తికేయన్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయనలో ఏ మార్పూ లేదు. అలాంటిది ఆయన ఇంత పెద్ద హీరో ఎలా అయ్యారో, ఏం చేశారో నాకు తెలియదు. సినీ రంగంలో ఇది చాలా కష్టం. ఆయనతో నటించేటప్పుడు ఇంత పెద్ద హీరో అవుతారని నేను అనుకోలేదు. నటుడిగా ఆయన వేరు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మనిషి ఒకేలా ఉన్నాడు’ అని తెలిపింది రెజీనా. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.