సూర్య శ్రీ దివ్యాంగులు ఛారిటబుల్ ట్రస్ట్ కి డిగ్రీ కాలేజీ మూవీ హీరో ఆలేటి వరుణ్ చేయూతనందించారు. ఛారిటబుల్ ట్రస్ట్ చదువుతన్న దివ్యాంగ విద్యార్థులకు బ్యాంక్ కోచింగ్ ఫీజు నిమిత్తం ఒక్కొక్కరికి ఆరు వేలు చొప్పున ఇద్దరికి 12వేల రూపాయలు అందజేశారు. ఈరోజు ఉదయం ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళి కృష్ణ గారికి 12వేల రూపాయలు హీరో ఆలేటి వరుణ్ అందజేశారు.
” దివ్యాంగులకు సేవ చేసే అవకాశం కలిపించినందుకు ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలని, ఈ సేవ తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇక హీరో వరుణ్ తో పాటు ప్రవాస భారతీయుడు కృష్ణ వంగవోలు 10వేలు, ప్రవాస భారతీయురాలు శశికళ 6వేలు ఆర్థిక సహకారం అందించారు. ఆర్థిక సహకారం అందించినందుకు ట్రస్ట్ గౌరవ సభ్యులు మండవ సుబ్బారావు దాతలకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ షేక్ సర్దార్ భాష దుగ్గినేని వెంకటరావు. నేరెళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు