అతిలోక సుందరి శ్రీదేవి క్రేజ్ ఎంతో తెలుగు వారికి తెలిసిందే. అయితే, తెలుగు, తమిళంలోనే కాదు ఆమె హవా హిందీ తెరపై కూడా ఓ రేంజ్లో ఉండేది. తనతో నటించేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడేవారు. జీతేంద్ర, అమితాబ్ లాంటి సీనియర్ హీరోలే కాదు సల్మాన్, షారుఖ్ లాంటి 1990ల కాలపు యువ హీరోలు కూడా శ్రీతో జోడీ కట్టారు. కానీ, కేవలం ఆమీర్ ఖాన్ మాత్రం ఆమెతో ఒక్క సినిమా కూడా చేయలేదు!
ఆమీర్ ఖాన్, శ్రీదేవి కాంబినేషన్ లో ఓ సినిమా అప్పట్లో ప్లాన్ చేశారు. మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ మొదటి సినిమా ‘కయామత్ సే కయామత్ తక్’ సూపర్ హిట్ అవ్వటంతో ఆయనతో సినిమాలు చేసేందకు నిర్మాతలు క్యూలు కట్టారు. శ్రీదేవి ఆ సమయానికి స్టార్ హీరోయిన్. ఫుల్ డిమాండ్ లో ఉండేది. కాబట్టి యంగ్ హీరో ఆమీర్ తో అతిలోక సుందరి తెరపై కనిపిస్తే కాంబినేషన్ అదిరిపోతుందని ఓ ప్రొడ్యూసర్ అంచనా వేశాడు. వెంటనే ఇద్దరితో ఓ హాట్ ఫోటోషూట్ కూడా కానిచ్చేశారు. కానీ, ఇక సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందనగా సీన్ రివర్స్ అయింది…
Read Also : “ఎస్ఎస్ఎంబి28″కు పూజా రెమ్యూనరేషన్ ఎంతంటే ?
ఆమీర్ ఖాన్ కేవలం ఒక్క సినిమా వయస్సున్న యంగ్ హీరో. జితేంద్ర, రిషీ కపూర్ మొదలు అనీల్ కపూర్, సన్నీ డియోల్ వరకూ చాలా మంది హీరోలతో శ్రేదేవి అప్పటికే సినిమాలు చేసింది. మరి ఆమె ఇతడి పక్కన పెద్దదానిలా అనిపించదా? అంతే కాదు, తన ఫస్ట్ మూవీలో ఆమీర్ ఖాన్ కాలేజ్ స్టూడెంట్ గా నటించాడు. వెంటనే రెండో సినిమాలో శ్రీదేవితో ముదురు క్యారెక్టర్ ఎలా చేయగలడు? ఇలాంటి చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకుని ఆమీర్ సినిమా వద్దన్నాడట. అప్పట్లో మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ జుహీ, కరిష్మా లాంటి యంగ్ బ్యూటీస్ తోనే ఎక్కువగా సినిమాలు చేశాడు. తనకంటే ముందు నుంచీ తెరపై ఉన్న సీనియర్ కథానాయికల జోలికి వెళ్లేవాడు కాదు. అలా శ్రీదేవితో ఆమీర్ సినిమా వర్కవుట్ కానీ డ్రిమ్ ప్రాజెక్ట్ గా మిగిలిపోయింది…