NTV Telugu Site icon

Salaar : సలార్ సినిమాలో ప్రభాస్ గొడ్డుకారం మాత్రమే ఎందుకు తింటాడో తెలుసా?

Prabhas Chilli Powder

Prabhas Chilli Powder

Do You Know why Prabhas eats Chilli Powder in Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ సినిమా గత నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిం భారీ వసూళ్లు సాధిస్తూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాలో దేవరధ అలియాస్ సలార్ పాత్రలో ప్రభాస్ కనిపించగా సినిమాలో చాలా బలవంతుడిగా దర్శకుడు ప్రశాంత్ నీల్ చూపించాడు. అయితే, అమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడి తన బలాన్ని అంతటినీ తనలోనే అణచివేసుకుని గొడ్డుకారం తింటున్నా కోపమనేదే లేకుండా ఉంటాడని దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. అయితే గొడ్డుకారం తింటే పౌరుషం, కోపం పెరుగుతుందని అనుకుంటారు కానీ, కోపాన్ని అణచివేసుకునే దేవా ఈ గొడ్డుకారం ఎందుకు తింటున్నాడో తెలుసా? ‘సలార్‌లో దేవా ఎందుకు గొడ్డుకారంతోనే అన్నం తింటాడు’ అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ఒక వ్యక్తి వీడియో చేయగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చెప్పిన కారణం నవ్వు తెప్పించే విధంగా ఉంది.

Rathnam : ‘రా రా రత్నం’ అంటున్న విశాల్

సినిమాలో ఒక చిన్నారి నా బర్త్‌డే కేక్ కొయ్యమని జస్ట్ ఒక ప్లాస్టిక్ కత్తిని దేవాకి ఇవ్వగా దాని చూసి వాళ్లమ్మకి భయమేస్తుంది. ఆ కత్తిచ్చేయ్ దేవా అని అరచి చెబుతుంది, అంటే.. దేవా వాళ్లమ్మని అంతలా భయపెట్టాడని, ఆ కత్తి చూసి మళ్లీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి సలార్‌లా, రాక్షసుడిలా మారిపోతాడని వాళ్లమ్మ ఇంట్లో ఏ విధమైన కత్తులు, కత్తిపీటలు, కొడవళ్లు లేకుండా చేసిందని చెప్పుకొచ్చాడు. అవేమీ లేనప్పుడు కూరగాయలు కోయడం కష్టం కాబట్టి వాళ్లింట్లో ఏ కూరా ఉండదని చెప్పుకొచ్చాడు. అయితే సదరు వ్యక్తి చెప్పిన కారణం ఇప్పుడు అందరినీ నవ్విస్తోంది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ లో కూడా దేవా గొడ్డుకారం లేకుండా అన్నం తినడు అని వరద తన మనుషులతో చెబుతాడు. కాబట్టి ఈ కత్తులు అంశం కాదు కానీ ఎదో బలమైన విషయమే మనోడి గొడ్డు కారం వెనుక ఉంది. అది రెండో భాగంలో అయినా రివీల్ చేస్తారేమో చూడాలి.

Show comments