Site icon NTV Telugu

Coolie : కూలీలో అమీర్ ఖాన్ రోల్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Aamirkhan

Aamirkhan

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఎందుకంటే… రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో  అమీర్ ఖాన్ చేసిన దహా క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ పాత్ర కోసం మొదటగా అప్రోచ్ అయినది బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ ను. అవును స్క్రిప్ట్ కూడా విన్నాట్ట.. కాని, షారూక్ కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్‌ను వదిలేశాడు. తర్వాత లోకేష్ కనగరాజ్ నేరుగా ఆమిర్‌ను కలిశాడు.

Also Read : Tollywood Bundh : షూటింగ్స్ బంద్ ఎఫెక్ట్.. స్టార్ హీరో సినిమా రిలీజ్ వాయిదా

‘రజినీ గారితో ఓ ఫ్రేమ్‌లో కనిపించే అవకాశమిది, రోల్ చిన్నదే కానీ ఇంపాక్ట్ చాలా పెద్దది!’ అని ఫీలైన ఆమిర్ వెంటనే అంగీకరించాడు. ఇంకా రజినీకాంత్‌పై ఉన్న గౌరవం, లోకేష్‌పై నమ్మకంతో ఈ రోల్ కోసం ఆమిర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఎప్పుడూ బాలీవుడ్ ఈవెంట్స్‌లో కనిపించని ఆమిర్ ఖాన్ ఈసారి సౌత్‌లోనూ రజినీ కూలీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి వచ్చి సినీ లవర్స్ ను థ్రిల్ చేశాడు. 5 నిమిషాల స్పీచ్‌తో అభిమానుల గుండెల్లో చోటు సంపాదించాడు. ఆయన మాటల్లో ఉన్న సింప్లిసిటీ, రజినీపై ఉన్న గౌరవం బయట పెట్టేశాడు. ‘నేను ఈ రకమైన ఈవెంట్స్‌కు ఎప్పుడు రాలేదు, కానీ రజినీ పిలిచినప్పుడు నిరాకరించలేకపోయాను. ఈ సినిమా నాకు ప్రత్యేకమైన అనుభవం ఎందుకంటే నేను కూడా ఫ్యాన్‌గా రజినీతో ఓ ఫ్రేమ్‌లో ఉన్నాను. అమీర్ స్పీచ్ కు సోషల్ మీడియాలో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.  ‘బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ సౌత్ ఫ్యాన్స్ మనసులు గెలిచాడు. ఇక అమీర్ ఖాన్ నెక్ట్స్ సినిమాలకు సౌత్ లో గ్రాండ్ వెల్కమ్ రావడం ఖాయం అనే చెప్పొచ్చు.

Exit mobile version