పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్.. బాలివుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది..ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.. జూన్ 16 ణ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ మూవీ విడుదల టైం దగ్గర పడుతుండటంతో టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.. ప్రీరిలీజ్ బిజినెస్ లు కూడా కళ్లు చెదిరే ధరకు జరుగుతున్నాయి..
ప్రభాస్ సినిమా కావడంతో అంచనాలు ఆ రేంజ్ లో ఉన్నాయి.. ఇక బిజినెస్ కూడా ఏ మాత్రం తగ్గలేదు.. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే… ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓం రౌత్ కోరినట్లు ప్రతి థియేటర్‌లో ఒక సీటు హానుమంతుని కోసం కేటాయిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీటు పక్క సీట్‌కి భారీ ధర పలుకుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయంపై మూవీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ స్పందిస్తూ ‘ఆదిపురుష్’ టికెట్ ధరల విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆంజనేయుడికి రిజర్వ్ చేసిన పక్క సీట్ల ధరల్లో ఎలాంటి తేడా లేదు.
అయితే, మిగిలిన సీట్ల మాదిరిగానే దాని ధర ఉంటుంది. ఇలాంటి వార్తలు నమ్మకండి’ అంటూ ట్వీట్ చేశారు.. దాంతో ఈ వార్త సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంది.. ఇక ఈ సినిమాకి ప్రమోషన్లు చేసినా, చేయకపోయినా.. ఓపెనింగ్ డే కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదిపురుష్‌కి భయపడే. చాలా సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. 16న దేశ వ్యాప్తంగా ‘ఆదిపురుష్’కి సోలో రిలీజ్ దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రమోషన్లు కూడా ఆ స్థాయిలో చేసుకోవడం అవసరం. కానీ ఆదిపురుష్ టీమ్ ఆ దిశగా ఆలోచించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. గతంలో వచ్చిన డార్లింగ్ సినిమాలకు ఉన్న ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకు లేదనే చెప్పాలి.. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యక తప్పదు..
