‘ఇండియన్ 2’.. ఈ సినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది.. అప్పట్లో శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చాలా కాలం తర్వాత ఈ సినిమా కు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.కానీ ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది.కమల్ హాసన్ చొరవతో శంకర్ ఈ సినిమాను మళ్ళీ సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. కమల్ హాసన్ ఎన్నో ఏళ్ల తర్వాత ‘విక్రమ్’ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఫామ్ లో కి వచ్చాడు.ఆ ఫామ్ లో నే ఇండియన్ 2 సినిమాను స్టార్ట్ చేసారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ను లైకా ప్రొడక్షన్స్ కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమా కు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు..
ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల గురించి ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లారిటీ రాలేదు.కానీ తాజాగా ఈ సినిమా విడుదల పై ఒక అప్డేట్ వచ్చినట్లు సమాచారం.ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అయ్యే అవకాశం లేదు.ఎందుకంటే ఈ సినిమా షూట్ అయిపోయిన కూడా ఈ సినిమా కు సంబంధించి విజువల్స్ ఎఫెక్ట్స్ పనులు బ్యాలెన్స్ ఉన్నాయని సమాచారం.ఈ సినిమా విడుదల వచ్చే సంవత్సరం వేసవిలో ఉండే అవకాశం అయితే ఉంది.దీంతో ఈ సినిమా విడుదల పై ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుంది.అలాగే శంకర్, రామ్ చరణ్ సినిమా షూట్ కొద్దీ భాగం షూటింగ్ మిగిలి ఉంది. అది పూర్తి అవగానే వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.