Meher Ramesh Acted as Mahesh Babu’s Friend in Bobby Movie: ప్రస్తుతం మెహర్ రమేష్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమా చేసి ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా దారుణంగా విఫలమైంది అనే చెప్పాలి. నిజానికి ఇప్పటి వరకు రమేష్ చేసిన కొన్ని సినిమాలు అలాగే ఫ్లాప్ అవుతూ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవికి కజిన్(తమ్ముడు) అయ్యే ఈయన మెగా ఫ్యామిలీ అశీసులతో ముందు నటుడిగా ప్రయత్నించాడు. మహేష్ బాబు హీరోగా నటించిన బాబి సినిమాలో సునీల్, బాబీ స్నేహితుడి పాత్రలో మెహర్ రమేష్ నటించాడు. ఆయన దర్శకుడు కాకముందే ఈ సినిమా వచ్చింది.
Anupam Kher: ‘టైగర్ నాగేశ్వరరావు’ను పట్టేందుకు రంగంలోకి అనుపమ్ ఖేర్..
అలా మొదట ఇండస్ట్రీకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసేవారు. పునీత్ తో పూరీ సినిమా చేయాల్సి వచ్చినప్పుడే ఇక్కడ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన కన్నడ సినిమా చేయలేక మెహర్ రమేష్ కు ఆ సినిమా అందించగా అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత చేసిన అజయ్ అనే ఒక్కడు రీమేక్ కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆ తర్వాత మెహర్ రమేష్ క్రాంతి, శక్తి, షాడో వంటి సినిమాలు చేసి ఆశించిన ఫలితాలు అయితే రాలేదు. ఇక ఆ తరువాత ఆయన ఏకంగా పదేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఆయన భోలా శంకర్ అనే సినిమా చేయగా అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు.