Do You Know Megastar Chiranjeevi Watch Rate:మెగాస్టార్ చిరంజీవి రక్షాబంధన్ సందర్భంగా తన చెల్లెళ్ళు తన చేతికి రాఖీలు కడుతున్న వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన తర్వాత వీడియోలో ఉన్న ఫోటోలు మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తన తండ్రి వెంకటరావు మామ అల్లు రామలింగయ్య ఫోటోలు పూజ గదిలో ఉంచి దేవుళ్లతో సమానంగా ఆయన పూజిస్తున్నారంటూ పలువురు నెటిజన్లు ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఎడమ చేతికి ఉన్న వాచ్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీల షర్టులు, వాచ్లు, షూస్ ఇలా అన్ని విషయాల మీద నెటిజన్లు శోధనలు జరుపుతూ వాటి రేట్లు ఎంత అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చలు నడుపుతున్నారు.
Kathanar: బ్రేకింగ్.. మరో ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అనుష్క శెట్టి
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేతికి పెట్టుకున్న వాచ్ గురించి కూడా అదే విధంగా సెర్చ్ చేయగా కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి చేతికి పెట్టుకున్న వాచ్ రోలెక్స్ కంపెనీకి చెందిన వాచ్ ఆన్లైన్ లో పరిశీలిస్తే దాని ధర 2 లక్షల 35 వేల డాలర్లు ఉంది. ఆ లెక్కన మన భారత కరెన్సీ ప్రకారం చూసుకుంటే కోటి 94 లక్షలు అన్నమాట. ఇక ఈ ధర విన్న తర్వాత అంత డబ్బుంటే హైదరాబాదులో 4 ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కొనవచ్చు కదా అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అనే కాదు దాదాపు మన స్టార్ హీరోలు అందరూ అదే విధంగా ఖరీదైన బట్టలు, వాచీలు, కార్లు వాడుతూ హాట్ టాపిక్ అవుతున్నారు. అయితే ఇదంతా ఒక్కరోజులో వచ్చిన సంపద ఏమీ కాదు వారంతా ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ కష్టపడి ఈ స్థాయికి వచ్చారని అందరూ గుర్తుంచుకోవాలి.