Jaffer Sadiq in Jawan: జాఫర్ సాధిక్ అనగానే ఎవరీ జాఫర్ సాధిక్ అనుకోవచ్చు మీరందరూ. అయితే ఈ మధ్య కాలంలో తమిళ సినిమాల్లో మెరుస్తున్న పొట్టి వ్యక్తే ఈ జాఫర్ సాధిక్. అన్నట్టు తెలుగు వారికి కూడా మనోడు బాగా పరిచయమే, ఎందుకంటే ఈమధ్యనే వచ్చిన సైతాన్ అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ పోషించిన వ్యక్తి తమ్ముడి పాత్రలో మెరిశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జవాన్ లో విలన్ విజయ్ సేతుపతి గాంగ్ లో ఒకడిగా కనిపించాడు. దీంతో అతను ఎవరు? అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. కేరళకు చెందిన జాఫర్ సాధిక్ 2016లో విజయ్ టీవీలో ప్రసారమైన కింగ్స్ ఆఫ్ డ్యాన్స్ డ్యాన్స్ షో ఫైనల్స్‌కు చేరుకుని ఫెమస్ అయ్యాడు. అంతకు ముందు ఉంగలిల్ యార్ ప్రభుదేవా 2 డ్యాన్స్ షోలో రన్నరప్‌గా నిలిచాడ, జోడి నంబర్ వన్ డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నాడు.
Miss Shetty Mr Polishetty Review: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రివ్యూ
తరువాత చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజ్ వంటి అనేక కళాశాలలలో, బ్రాండ్ల సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇచ్చారు. చివరికి కొరియోగ్రాఫర్ అయ్యి చెన్నైలోని తన డ్యాన్స్ స్టూడియో లిఫ్ట్ అదర్స్‌లో చాలా మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాడు. ఇక జాఫర్ సాదిక్ తొలి మూవీ కమల్ హాసన్ మరియు విజయ్ సేతుపతి నటించిన 2022 తమిళ చిత్రం విక్రమ్. ఆ తరువాత వెందు తనింధతు కాడులో రాథర్ అనే పాత్రలో కూడా నటించాడు. ఆ తర్వాత 2023లో, రజనీకాంత్ , మోహన్‌లాల్ – శివరాజ్ కుమార్ నటించిన తమిళ చిత్రం జైలర్‌లో కూడా నటించాడు. ఇక ఇప్పుడు ఈ జవాన్ సినిమాతో మరోసారి నక్కతోక తొక్కాడా? అనిపించేలా నటించాడు. ఇక విజయ్ , సూర్య, సంజయ్ దత్ – త్రిష నటించిన తమిళ చిత్రం లియోలో కూడా నటించాడు.