మనం సినిమా లో గెస్ట్ రోల్ లో ఎంటర్టైన్ చేసిన అఖిల్ అక్కినేని ఆ తరువాత దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన అఖిల్ సినిమా తో అఖిల్ హీరో గా పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా అఖిల్ ను నిరాశ పరిచింది. ఆ తరువాత వచ్చిన మిస్టర్ మజ్ను సినిమా కూడా నిరాశపరిచింది.బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా తో మంచి హిట్ అందుకున్నాడు అఖిల్.కానీ ఆ సినిమా క్రెడిట్ హీరోయిన్ పూజ హెగ్డే ఖాతాలో పడింది.అఖిల్ కు క్రెడిట్ దక్కలేదు.ఇక భారీ అంచనాల తో విడుదలైన అఖిల్ ఏజెంట్ సినిమా దారుణంగా నిరాశ పరిచింది.ఏజెంట్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్ బాడీను కూడా పెంచాడు. అలాగే లాంగ్ హెయిర్ తో డిఫరెంట్ గా కనిపించి ఆకట్టుకున్నాడు.
అయితే ఈ సినిమా మాత్రం దారుణం గా నిరాశపరిచింది. దాంతో అఖిల్ ఫ్యాన్స్ తన తరువాత సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉండగా ఏజెంట్ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం ఏజెంట్ ఓటీటీల్లోకి వస్తుందని వార్తలు వచ్చాయి.కానీ ఇంకా రాలేదు దాంతో ప్రేక్షకులు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారు. అసలు ఏజెంట్ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.వస్తే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి..ఈ సినిమాను వచ్చే నెల లో ఓటీటీ లో విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మరీ ఏజెంట్ ఓటీటీ లో మంచి వ్యూస్ సాధిస్తుందో లేదో చూడాలి.
