NTV Telugu Site icon

Adipurush :14 వ రోజుకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా..?

Whatsapp Image 2023 06 30 At 11.31.54 Am

Whatsapp Image 2023 06 30 At 11.31.54 Am

ప్రభాస్.. బాహుబలి సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా స్టార్‌గా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకు పోతున్నాడు.బాహుబలి ఇచ్చిన ఉత్సాహంలోనే వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు.. ఇలా ఇటీవలే ప్రభాస్ ‘ఆదిపురుష్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. ఓం రౌత్ తీసిన ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ మరియు ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు. అజయ్, అతుల్ మ్యూజిక్ అందించారు.  ప్రభాస్ రాముడిగా,సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా మరియు సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్తా హనుమంతుడిగా చేశారు.భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్లు మాత్రం అంతగా రావడం లేదనీ చెప్పాలి..ఈ సినిమా విడుదల అయి రెండు వారాలు పూర్తి అయింది దీంతో రెండు వారాల్లో ఈ సినిమాకు ఆకట్టుకునేంత కలెక్షన్స్ అయితే రాలేదు..

అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రారంభంలో అందరి దృష్టినీ బాగా ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలోనే డిమాండ్ ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ దాదాపు రూ. 130 కోట్లు బిజినెస్ చేసుకున్నట్లు సమాచారం.. అలాగే, మిగిలిన ప్రాంతాల రైట్స్ కలిపి రూ. 240 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌ అయినట్లు సమాచారం.’ఆదిపురుష్’ మూవీకి 14వ రోజు హాలీడే ఉన్నా కూడా ఆశించిన రీతిలో అయితే స్పందన రాలేదు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 30 లక్షలు లోపే షేర్ కలెక్ట్ చేసింది.వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే ఈ సినిమాకు రూ. 60 లక్షలు లోపే షేర్ దక్కింది. ఇలా రెండు వారాల్లో ఈ చిత్రం సుమారు రూ. 242 కోట్లు టార్గెట్‌కు ఇంకా రూ. 50 కోట్లకు పైగానే వెనుకబడి ఉన్నట్లు తెలుస్తుంది.మొత్తంగా ఈ సినిమాకు రూ. 45 కోట్లకు పైగా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం..

Show comments