Site icon NTV Telugu

Divya Spandana: నిద్ర పోతున్న ‘దివ్య స్పందన’.. లేపి మరణ వార్త చెప్పడంతో షాక్.. అసలు ఏమైందంటే?

Divya Spandana Death

Divya Spandana Death

Divya Spandana Reacts to her death Rumors: కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివ్య స్పందన అలియాస్ రమ్య అనే నటి మాజీ ఎంపీ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా కలకలం రేగింది. గతంలో కన్నడ సినీ పరిశ్రమలో అనేక సినిమాల్లో నటించిన ఆమె సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించింది. తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయి ఎంపీగా కూడా గెలిచిన ఆమె ఇప్పుడు కాస్త లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం తప్ప నేరుగా ఆమె యాక్టివ్గా అయితే ఉండడం లేదు. అయితే ఆమె గుండెపోటు కారణంగా చనిపోయారని సోషల్ మీడియాలో ఒక పిఆర్ఓ పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆమె నిజంగానే చనిపోయారని భావించి జాతీయ మీడియా కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం ప్రారంభించింది. దీంతో ఆమెకు పర్సనల్గా పరిచయం ఉన్న కొంతమంది జర్నలిస్టులు ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఒక జర్నలిస్టు తన ట్విట్టర్ ద్వారా తాను దివ్య స్పందనతో మాట్లాడినట్టు వెల్లడించారు.

Salaar: సలార్ వాయిదానే పడలేదు.. అప్పుడే మోహరించిన నాలుగు సినిమాలు!

ఆమె జెనీవాలో ఉందని ప్రశాంతంగా నిద్రపోతుందని ఆమె చనిపోయింది ఏమో అని అందరూ కాల్స్ చేస్తుంటే అప్పుడు ఆమె నిద్ర లేచారని చెప్పుకొచ్చింది. అంతేకాక నేను చనిపోయానని చెప్పింది ఎవరు అని ఆమె సీరియస్ అయ్యారని కూడా సదరు జర్నలిస్ట్ రాసుకొచ్చారు. అంతేకాక ముందుగా ఈ ట్వీట్ చేసిన వ్యక్తిని ఒక బాధ్యత లేని వ్యక్తిగా పేర్కొన్న సదరు జర్నలిస్ట్ అతని ట్వీట్ చూసి వార్తా సంస్థలు బ్రేకింగ్ న్యూస్లు ప్రసారం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని కూడా చెప్పుకొచ్చింది. మొత్తం మీద దివ్య స్పందన మరణం అనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి కొద్ది రోజుల క్రితం కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన హార్ట్ ఎటాక్తో చనిపోయారు. ఆమె చనిపోయి కూడా సుమారు 15- 20 రోజులు అవుతుంది, బహుశా ఆమె వార్తను పొరబడి ఇప్పుడు మళ్లీ పోస్ట్ చేసి ఉంటారేమో అనే వాదన వినిపిస్తోంది. ఆమె చనిపోయి చాలాకాలం అవడంతో ఇప్పుడు ఈ స్పందన చనిపోయి ఉంటారని మిగతావారు భావించి పోస్టులు పెట్టినట్లుగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

Exit mobile version