Divija Prabhakar: “నేను జెన్‌జీ ముసల్దాన్ని.. ఆ ఖర్చులన్నీ దాస్తే ఇంకో ఇల్లు కొనేవాళ్లం”: దివిజ ప్రభాకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divija Prabhakar: సోషల్ మీడియా సెన్సేషన్, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ దివిజ ప్రభాకర్ తాజాగా ఎన్టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని తన లైఫ్ స్టైల్, సంపాదన, మిడిల్ క్లాస్ వాల్యూస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈ జనరేషన్లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉందంటూనే, మెంటల్‌గా తానొక పాతకాలపు మనిషినని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఈ జనరేషన్లో ఉన్న టెక్నాలజీ, ఎక్స్పోజర్, సోషల్ మీడియా చూస్తుంటే జెన్జీగా పుట్టినందుకు చాలా గ్రేట్‌ఫుల్‌గా అనిపిస్తుంది. కానీ, నేను మెంటల్‌గా చాలా ఓల్డ్ స్కూల్ (పాతకాలపు) మనిషిని. ఎంత పాతకాలం అంటే.. నా చాదస్తం చూసి మా మమ్మీ, డాడీ నన్ను ‘ముసల్దానా’ అని పిలుస్తుంటారు. నా డిజైనర్ కూడా నువ్వు ముసల్దానిలా మాట్లాడతావేంటి అంటుంటారు. అయినా సరే ఐ యామ్ ఏ ప్రౌడ్ జెన్‌జీ” అంటూ చెప్పుకొచ్చింది.
తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్తూ.. “మాది కోర్ మిడిల్ క్లాస్ లేదా అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న కుటుంబం. మాకు కావాల్సినవన్నీ ఇస్తూ మా నాన్న నన్ను, మా అన్నయ్యను చాలా కంఫర్టబుల్‌గా పెంచారు. కష్టాలనేవి మా వరకు రానివ్వలేదు. కానీ, ఎప్పుడైతే నేను సినిమాల్లోకి వచ్చి సొంతంగా సంపాదించడం మొదలుపెట్టానో.. అప్పుడు నాకు బడ్జెటింగ్ అంటే ఏంటో తెలిసింది. సొంత డబ్బులు ఖర్చవుతుంటే అబ్బా ఇంత ఖర్చు పెట్టేస్తున్నామా అనిపించి అనవసర లగ్జరీలను తగ్గించుకున్నా. ఇప్పుడు ఫ్రెండ్స్‌తో బయటికెళ్లినా బిల్లు స్ప్లిట్ (షేర్) చేసుకుంటాం” అని రియాలిటీని పంచుకుంది.
Also Read
- Allu Arjun-Atlee: అల్లు అర్జున్ కీలక నిర్ణయం.. డైరెక్టర్ అట్లీకి డెడ్‌లైన్?
- Aditya Dhar: 'నువ్వు నా నటుడివి కాదు.. నా బ్రదర్‌వి': రణ్వీర్ సింగ్‌పై 'ధురంధర్' డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్!
- Theatrical Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న సౌత్ సినిమాలు..
- Pan-India Film: ఆల్మోస్ట్ ఫిక్స్.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే పాన్ ఇండియా ప్రాజెక్ట్!
తనకున్న సినిమా పిచ్చి గురించి చెబుతూ.. “నాకు సినిమాలు చూడటం అంటే పిచ్చి. ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే లేదా ప్రీమియర్ షో చూసేయాల్సిందే. ఎవరూ రాకపోతే ఒంటరిగానైనా థియేటర్‌కు వెళ్ళిపోతా. అందుకే మా మమ్మీ ఎప్పుడూ నన్ను తిడుతూ ఉంటుంది.. ‘నువ్వు ఇప్పటివరకు సినిమా టికెట్లకు, థియేటర్లలో పాప్‌కార్న్‌కు పెట్టిన ఖర్చంతటా దాచి ఉంటే.. ఈపాటికి మనం ఇంకో చిన్న ఇల్లు కొనేవాళ్లం అని అంటుంది” అని చెప్పుకొచ్చింది. డైట్లో ఉన్నప్పుడు పాప్‌కార్న్ తినాల్సి వస్తే ఆ రోజు లంచ్ లేదా బ్రేక్‌ఫాస్ట్ మానేసి బ్యాలెన్స్ చేస్తానని క్రేజీ సీక్రెట్ చెప్పింది. ప్రస్తుతం నటిగా, ఇన్ఫ్లుయెన్సర్గా బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. త్వరలోనే బిజినెస్ ఉమెన్‌గా మారబోతున్నట్లు హింట్ ఇచ్చింది. “నేను బిజినెస్ స్టూడెంట్‌ని. అందుకే నాకు అంట్రప్రెన్యూర్‌షిప్ (వ్యాపారం) అంటే చాలా ఇష్టం. ఫ్యూచర్లో కచ్చితంగా బిజినెస్ వైపు అడుగులు వేస్తా” అని క్లారిటీ ఇచ్చింది.
తాజావార్తలు
-
Divija Prabhakar: “నేను జెన్‌జీ ముసల్దాన్ని.. ఆ ఖర్చులన్నీ దాస్తే ఇంకో ఇల్లు కొనేవాళ్లం”: దివిజ ప్రభాకర్
-
Netanyahu: ఇజ్రాయెల్‌కు భారత్ అండ.. నెతన్యాహూ కామెంట్స్‌తో అమెరికా షాక్..
-
Suicide on Video Call : వీడియో కాల్‌లోనే విషాదం.. భార్య చూస్తుండగానే భర్త ఆత్మహత్య
-
PoK: జులై 9న ఫైనల్ వార్.. పాకిస్థాన్‌కు పీఓకే నేతల లాస్ట్ వార్నింగ్! ఆ రోజు ఏం జరగబోతోంది?
-
Israel: ఖమేనీ అంత్యక్రియల రోజే ఇరాన్‌కు షాక్.. ఇజ్రాయిల్ సంచలన హెచ్చరిక
ట్రెండింగ్
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!