మాస్ మహారాజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ “ఖిలాడీ”. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచారు. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్, ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను 28 మే 2021 న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కోవిద్-19 మహమ్మారి కారణంగా ఇది వాయిదా పడింది. రవి తేజ ఇందులో ద్విపాత్రాభినయనం చేయబోతున్నాడు అనే వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.
Read Also : మెగాస్టార్ బర్త్ డే… ట్విట్టర్ స్పేస్ సెషన్ లో ప్రముఖుల సందడి
తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ మాట్లాడుతూ రవితేజ క్యారెక్టర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. “ఖిలాడీ ఒక ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్. మనమందరం మన జీవితంలో డబ్బుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. జీవితంలో రవితేజ పాత్ర డబ్బు లేదా మానవ భావోద్వేగాలు అనేవి ప్రేక్షకులను ఆత్మపరిశీలన చేసుకుంటాయి. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తాడా లేదా త్రిపాత్రాభినయం చేస్తాడా అనేది సినిమా తెరపైకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏదేమైనా, ఈ చిత్రంలో అతని ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్ అతని అభిమానులను థ్రిల్ చేస్తుంది అని నాకు నమ్మకం ఉంది” అని దర్శకుడు చెప్పారు.
ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే మిగతా కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో సినిమా గురుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. “ఖిలాడీ” డిజిటల్ రైట్స్ ను పాపులర్ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
