Site icon NTV Telugu

Project K: ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ ‘బాంబ్’

Disha Patani In Project K

Disha Patani In Project K

ఆలిండియా స్టార్ ప్రభాస్ వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కే’ ఒకటి. ఎవడే సుబ్రమణ్యం, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా సై-ఫై జోనర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తాను ప్రభాస్‌ను ప్యాన్ వరల్డ్ స్టార్‌గా మారుస్తానని నాగ్ అశ్విన్ చెప్తున్న మాటల్ని బట్టి చూస్తే.. ఈ ప్రాజెక్ట్‌పై అతడు ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, బిగ్ బీ అమితాభ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌లో మరో బాలీవుడ్ బాంబ్ జాయిన్ అయ్యారు.

అది మరెవ్వరో కాదు.. దిశా పతానీ! ఈ అందమైన భామ ‘ప్రాజెక్ట్ కే’లో ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించనుంది. ఈమె చేరిక గురించి మేకర్స్ ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు కానీ, వైజయంతీ మూవీస్ నుంచి తనకొచ్చిన గిఫ్ట్‌ ఫోటోను దిశా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘ప్రాజెక్ట్ కే సినిమాలో భాగమైన నిన్ను చిత్రబృందం సాదరంగా ఆహ్వానిస్తోంది. నువ్వు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం త్రిల్లింగ్‌గా ఉంది’’ అని ఎన్వలప్‌లో రాసి ఉండడాన్ని మనం గమనించవచ్చు. నిత్యం బికినీ ఫోటోలతో సోషల్ మీడియాని హీటెక్కించే ఈ బ్యూటీ.. తన అందంతో సినిమాకి వన్నె తీసుకొస్తుందని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఒక భారీ సెట్‌లో జరుగుతోంది, ఇందులో అమితాభ్ ప్రముఖ పారిశ్రామికవేత్త అశ్వథ్థామగా కనిపిస్తుండగా, దీపికా పదుకొణె ఆయన ఎంప్లాయిగా నటిస్తోంది. ప్రభాస్ ఇందులో అమితాభ్ తనయుడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రభాస్‌కి ఉన్న ప్యాన్ ఇండియా క్రేజ్, సబ్జెక్ట్ ప్యాన్ వరల్డ్ అప్పీల్ కలిగి ఉండడంతో.. వైజయంతీ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Dishaprojectk 1651992987

Exit mobile version