Site icon NTV Telugu

Disha Patani: మేడమ్ మీ డ్రెస్ చాలా చోట్ల చిరిగింది, టైలర్ ని మార్చండి

Disha Patani

Disha Patani

దిశా పటాని అనగానే యూత్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చే హీరోయిన్ గుర్తొస్తుంది. తన సినిమాల కన్నా స్కిన్ షోతో, బికినీ ఫోటోస్ తోనే ఎక్కువగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ ఫోటోస్ పోస్ట్ చెయ్యడంలో నేషనల్ అవార్డ్ ఉంటే అది కాంపిటీషన్ లేకుండా దిశా పటానికి ఇచ్చేయొచ్చు. అంతలా గ్లామర్ షో చేసే దిశా పటాని రీసెంట్ గా తన ట్విట్టర్ లో కొన్ని ఫోటోస్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోస్ లో బ్లాక్ డ్రెస్ వేసుకోని దిశా చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. ఆమె పక్కనే పర్సనల్ ట్రైనర్ ‘అలెక్స్’ కూడా ఉన్నాడు. ఎప్పటిలాగే దిశా పటాని పోస్ట్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈసారి దిశా పటాని ఫోటోస్ కన్నా, ఆ ఫోటోస్ కింద ఒక ఫ్యాన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోంది.

దిశా పటాని ఫోటోస్ చూసిన ఆమె అభిమాని… “మీ బట్టలు అన్ని చోట్లా చిరిగింది, మీరు టైలర్ ని మార్చండి” అంటూ కామెంట్ చేశాడు. మిగిలిన ఫాన్స్ అందరూ సూపర్, బంపర్, హాట్, సెక్సీ అంటూ కామెంట్స్ చేస్తుంటే ‘ట్వీట్ చోర్’ అనే అకౌంట్ నుంచి మాత్రం ఇలాంటి ఫన్నీ కామెంట్ రావడం అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఈ కామెంట్ చూసిన వాళ్లు నిజమే అంటూ రిప్లై ఇస్తున్నారు. మరి దిశా పటాని ఈ సలహాని కన్సిడర్ చేస్తుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం దిశా పటాని ప్రస్తుతం ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ K’, సూర్యతో ‘సూర్య 42’, సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘యోధ’ సినిమాలో నటిస్తోంది. భారి బడ్జట్ తో పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ఈ సినిమాలు రిలీజ్ అయితే దిశా పటాని కెరీర్ కి సాలిడ్ బ్రేక్ దొరికినట్లే.

Fan Tweet

Exit mobile version