14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అన్నారు. ఈ సినిమా విడుదలై మంచి టాక్ తో దూసుకెళ్లడం సంతోషన్నిస్తుందన్నారు. ఫుల్ ఫన్ రైడ్ గా సాగే ఈ సినిమాను ప్రేక్షకులు మరింత విజయవంతం చేయాలని మూవీ టీమ్ కు విజయేత్సవ శుభాకాంక్షలు తెలిపారు.14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం యూత్ కి అద్భుతంగా కనెక్ట్ అయిందని అందుకే మంచి రెస్పాన్స్ వస్తుందని మీర్జాపూర్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ చెప్పారు. సినిమాలో కామెడీతో పాటు మంచి ఎమోషనల్ ఎంగేజ్ మెంట్ ఉందని డైరెక్టర్ గుర్మీత్ సింగ్ తెలిపారు.
Also Read : Tollywood : రీరిలీజ్ లు సూపర్ హిట్.. కారణాలు ఏంటి..?
14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రాన్ని చూసి ఎంజాయే చేయండి అని నిర్మాత అల్లూ బాబీ పేర్కొన్నారు. ఫ్యామిలీతో కలిసి చూసే క్లీన్ సినిమా అని చెప్పారు. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లముడి ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది ప్రేక్షకులకు మరింత చేరువ కావాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షించే సబ్జెక్ట్ ఈ చిత్రంలో ఉందని తెలిపారు. సినిమా విడుదలై అన్ని చోట్ల పాజిటీవ్ టాక్ తెచ్చకున్నందుకు టీమ్ కు నా శుభాకాంక్షలు. సత్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సత్య కోమల్ నిర్మాతగా శ్రీ హర్ష మన్నె దర్శకత్వం వహించిన చిత్రం 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో. #90s వెబ్ సిరీస్ తెరకెక్కించిన ఎంఎన్ఓపీ అధినేత రాజశేఖర్ మేడారం సహకారంతో ఈ చిత్రాన్ని ఇటీవల ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి రెస్పాన్స్ తో యూత్ ఫుల్ కామెడీగా దూసుకెళ్తుంది. అంకిత్ కొయ్య, శ్రియ కొంతం హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్రలో ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
