NTV Telugu Site icon

Vivek Agnihotri: స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు.. వాళ్లు ఉన్నంతకాలం బాలీవుడ్ అంతే..!!

Vivek Agnihotri

Vivek Agnihotri

బాలీవుడ్‌లో ఈ ఏడాది భారీ హిట్ అందుకున్న చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలపై వివేక్ అగ్నిహోత్రి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘కింగ్స్‌, బాద్‌షాలు, సుల్తాన్‌లు ఉన్నంత కాలం బాలీవుడ్‌ మునిగిపోతూనే ఉంటుంది. ప్రజల గాథలతో సినిమాలు తీసి బాలీవుడ్‌ను ప్రజల పరిశ్రమగా మార్చాలి. అది మాత్రమే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమగా వృద్ధి చెందుతుంది’ అని ట్వీట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్ ద్వారా వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ స్టార్లుగా కొనసాగుతున్న షారుఖ్‌ ఖాన్, సల్మాన్‌‌ ఖాన్‌లను పరోక్షంగా విమర్శిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Also: Viral: నదిలో యువకుడి స్టంట్.. తిరిగిరాలేదు..

కాగా ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో విడుదలవుతున్న అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారడంతో సినిమాలో సరుకు ఉంటేనే ఆదరిస్తున్నారు. దక్షిణాది చిత్రాలు పుష్ప, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్-2 సినిమాలకు బాలీవుడ్‌లో మంచి ఆదరణ దక్కింది. అదే సమయంలో బాలీవుడ్ స్టార్లు నటించిన చిత్రాలు బోల్తా కొట్టాయి. ఇటీవల బయోపిక్‌లపై బాలీవుడ్ ఎక్కువగా ఆధారపడుతోంది. కానీ వాటికి కూడా ఆదరణ దక్కడం లేదు. దీంతో ఆవేదన చెందిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ స్టార్లను ఉద్దేశించి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.