SSMB 28: మాటల మాంత్రికుడు డబుల్ డోస్ ఇవ్వనున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయింది. మరి ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబో ఎలా ఉండాలి? అదిరిపోయేలా ఉండాలి, గతంలో బాకీ పడిన హిట్ ని సాలిడ్ గా కొట్టేలా ఉండాలి. అందుకే ప్రయోగాలకి పోకుండా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా SSMB 28ని తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా సంకేతం ఇచ్చేసింది. మిర్చి యార్డులో బీడితో నడిచి వస్తున్న మహేష్ ఫోటో SSMB 28 సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది. నెక్స్ట్ షెడ్యూల్‌లో మిర్చి యార్డులో భారీ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న ఎస్ఎస్ఎంబీ 28 రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అనౌన్స్మెంట్ నుంచే భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. వైరల్ అవుతున్న ఆ రూమర్ వింటేనే SSMB 28 సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు పీక్స్‌కు వెళ్తాయి. ఈ మోస్ట్ అవైటింగ్ సినిమాలో మహేష్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నాడట. అది కూడా తండ్రీ కొడుకులుగా మహేశ్ నటిస్తున్నాడట. తండ్రిగా మహేష్ గెటప్ ఓ రేంజ్‌లో ఉంటుందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ఫాదర్ రోల్ రివీల్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ఈ పుకార్లు ఫ్యాన్స్‌కు ఎగ్జైటింగ్‌గా మారాయి. మహేష్ డబుల్ రోల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఖాయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా తెరపై ఒక మహేశ్ బాబు కనిపిస్తే ఘట్టమనేని అభిమానులు బాక్సాఫీస్ లెక్కలు మారుస్తారు, అలాంటిది ఇక ఇద్దరు మహేశ్ బాబులు కనిపిస్తే దాని ఇంపాక్ట్ బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ న్యూస్ జస్ట్ రూమర్ గా మాత్రమే ఉంటుందా లేక మహేశ్ నిజంగానే డ్యూయల్ రోల్ లో SSMB 28 సినిమా చేస్తున్నాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.
Also Read
- Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
- Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! 'భాయ్‌జాన్'కు ఏమైంది?
- Yadhu Vamsi: 'నా కొడుకు సాధించాడు'.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
- Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
-
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!