జోకర్ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది, వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ దర్శకుడు టాడ్ ఫిలిప్స్ తన ఇన్‌స్టాగ్రామ్ లో “జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్” అప్డేట్ ని రివీల్ చేశాడు. జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్ అనేది జోక్విన్ ఫీనిక్స్ నటించిన 2019 బ్లాక్‌బస్టర్ మూవీ జోకర్‌కి చాలా ఎదురుచూసిన సీక్వెల్. ఈ చిత్రం అక్టోబర్ 4, 2024న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ నుంచి క్విన్‌గా ‘లేడీ గాగా’ ఫస్ట్ లుక్ ని టాడ్ ఫిలిప్స్ రిలీజ్ చేశాడు. 2022 ఆగస్టులోనే జోకర్ సీక్వెల్‌లో నటిస్తున్నానని ‘గాగా’ అనౌన్స్ చేసింది కానీ ఇప్పటివరకూ ఆమె లుక్ ఏంటి? జోకర్ 2లో ‘గాగా’ ఎలా కనిపించబోతుంది అనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఆ వెయిటింగ్ ని బ్రేక్ చేస్తూ… ఈ మూవీలో గాగా ఎలా కనిపించబోతుందో రివీల్ చేసేసాడు టాడ్ ఫిలిప్స్.
డైరెక్టర్ టాడ్ ఫిలిప్స్ అప్‌లోడ్ చేసిన ఫోటోలో జోక్విన్ ఫీనిక్స్ ప్లే చేసిన ‘జోకర్’తో పాటు గాగా ఒక వాల్ కి ఆనుకుని నిలబడి ఉంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు ఆమె చేతులు అతని చెంపలపై ఉన్నాయి. ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ, ఫిలిప్స్ ‘హ్యాపీ వాలెంటైన్స్ డే’ అని క్యాప్షన్ ఇచ్చాడు. హార్లే యొక్క మూల కథలో “హర్లీన్ క్వింజెల్” అనే థెరపిస్ట్‌గా పనిచేస్తున్న సమయంలో గాగా మొదటిసారిగా జోకర్‌ను కలుసుకోవడాన్ని ఈ పోస్టర్ ఇమ్పర్సోనేట్ చేస్తుంది. ఫిలిప్స్ లేడీ గాగాతో కలిసి పనిచేయడం ఇది రెండోసారి. వీరిద్దరు గతంలో ఎ స్టార్ ఈజ్ బోర్న్ చిత్రంలో కలిసి పనిచేశారు. మరి పార్ట్ 1తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జోకర్ ఫిల్మ్ యూనిట్, జోకర్ 2తో ఎలాంటి హిట్ కొడతారో చూడాలి.
