Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Director Tharun Bhascker Interview About Keedaa Cola Film

Tharun Bhascker : లాక్ డౌన్లో అలా పుట్టిందే ‘కీడా కోలా’ : తరుణ్ భాస్కర్

Published Date :October 31, 2023 , 6:19 pm
By Bhargav Chaganti
Tharun Bhascker : లాక్ డౌన్లో అలా పుట్టిందే ‘కీడా కోలా’ : తరుణ్ భాస్కర్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Director Tharun Bhascker Interview about Keedaa Cola film: ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో సినిమాగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై అంచనాలని పెంచింది. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

‘కీడా కోలా’ ఐడియా ఎప్పుడు ,ఎలా వచ్చింది?
లాక్ డౌన్ చాలా మంది రకరకాలుగా వినూత్నంగా డబ్బులు సంపాదిస్తున్నారని తెలిసి నాకు చాలా కామెడీగా అనిపించింది. రోడ్ పై మ్యాన్ హోల్ కవర్ లేదు. ఎవడో ఇనపసామాన్లు వాడికి అమ్మేసాడట. వాడిని సినిమాల్లోకి ఎక్కించాలనిపించింది (నవ్వుతూ). ఇంకా సంపాయించడానికి మార్గాలు ఏమున్నాయని అడిగితే.. తినే పదార్ధాలలో పురుగు పడిందని కేసు వేసి కూడా సంపాదించవచ్చని ఫ్రెండ్స్ చెప్పారు. ఇలా చాలా ఆసక్తికరమైన చర్చనడిచింది. అయితే ఇదంతా క్రైమ్. కానీ దూరం నుంచి చూస్తే కామెడీ. ప్రతి క్రైమ్ దూరం నుంచి చూస్తే కామెడీనే. ఇది నా ఫేవరేట్ జోనర్ కూడా. అక్కడ నుంచి కీడా కోలా ఆలోచన వుంది. చిన్నప్పటి నుంచి నా ఫేవరేట్ జోనర్ ఇది. నా ఆల్ టైం ఫేవరేట్ మనీ మనీ. అందులో బ్రహ్మానందం గారి పాత్ర చాలా ఇష్టం. అలాగే జిగర్తండా, సుదుకవ్వం చిత్రాలు కూడా చాలా ఇష్టం. రొమాంటిక్ కామెడీలు నాకు బోరింగ్ సబ్జెక్ట్. నాతో పాటు నా ఫ్రెండ్స్ కి కూడా క్రైమ్ కామెడీలే ఇష్టం. ఇప్పుడీ సినిమాతో క్రైమ్ కామెడీ కల నిజమైయింది.

మొదటి సినిమాకే జాతీయ అవార్డు అందుకున్నారు కదా.. ఫిలిం మేకర్ గా ఎలాంటి బాధ్యత ఏర్పడింది ?
‘బాధ్యత’ లాంటి మాటలు విన్నప్పుడే చాలా బరువుగా ఉంటుంది. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కొంచెం బరువైయింది. (నవ్వుతూ) ఆ బరువుని పక్కన పెడదామని ‘ఈ నగరానికి ఏమైంది’ చేశాం. ఈ సినిమా ఇంకా బరువును పెంచింది. ( నవ్వుతూ)

బ్రహ్మానందం గారికి పెయింట్ ని ప్రజెంట్ చేశారు కదా.. దాని గురించి చెప్పండి ?
ఎందులో ఆయన పెయిటింగ్ వేసి ప్రజెంట్ చేయాలని అనిపించింది. మూతి కొంచెం వంకరగా వచ్చింది. వంకరగా తిప్పి పెయిటింగ్ చూపించా. ఆయన వంకరగా చూశారు. ఎలావుందని అడిగాను. ‘నా మొహంలా వుంది’ అని చెప్పారు. ఆయన తిట్టారా ? పొగిడారా ? ఈ రోజు వరకు అర్థం కాలేదు. (నవ్వుతూ) ఆయన అద్భుతమైన పెయింటర్. నాకు హనుమాన్ పెయింటింగ్ ని బహుమతిగా ఇచ్చారు.

మీ సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి.. కీడాకోలా ఎలా వుంటుంది ?
గత రెండు సినిమాలతో పోల్చుకుంటే ఇందులో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. పెళ్లి చూపుల్లో ప్రతిది లాజికల్ గా ఉంటుంది. కోకాకోలా లో గన్స్ షాట్స్, బ్లాస్ట్స్ ఇలా చాలా వరకూ సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది.

సినిమాలు సమాజంపై ప్రభావం చూపిస్తాయి కదా.. ఈ విషయంలో మీరు ఎంత భాద్యతగా కథల రూపకల్పన చేస్తారు?
సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుందనే చెప్పాలి. నా కథలు పాత్రల విషయంలో భాద్యతగా వుంటాను. ఈ నగరానికి ఏమైంది చిత్రం వివేక్ పాత్ర గురించి వుంటుంది. చివర్లో తను స్నేహం కోసం మందుని వదిలేస్తాడు. అదేదో మెసేజ్ ఇవ్వాలని కాదు.. నాకు చెప్పాలనిపించింది చెప్పడానికి ప్రయత్నిస్తాను.

కీడా కోలా నటీనటుల ఎంపిక గురించి చెప్పండి ?
ఇందులో అందరు నటీనటులని ఆడిషన్స్ చేసి తీసుకున్నామని గర్వంగా చెప్పగలం. జీవన్, విష్ణు.. ఇలా అందరినీ ఆడిషన్స్ చేసే ఎంపిక చేశాం.ఇక ఇందులో నటించిన బ్రహ్మానందం గారు, రఘు గారు నాకు ఆదర్శమైన నటులు. రఘు గారు రోడీస్ లో బ్యాడ్ యాస్ క్యారెక్టర్ ఉంటుంది, అదే ఇందులో చేయాలి కాబట్టి నేచురల్ వచ్చింది.

బ్రహ్మానందం గారి గారి పాత్రకు స్ఫూర్తి ఉందా?
బ్రహ్మానందంగారి గారి పాత్రకు మా తాతయ్య స్ఫూర్తి. మా తాతయ్య నాకు మంచి ఫ్రెండ్. ఆయనది చాలా ఫన్ క్యారెక్టర్. ఆ పాత్రకు బ్రహ్మానందం గారైతే బావుంటుదనిపించింది. ఆయన అద్భుతంగా చేశారు. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.

కీడా కోలా విషయంలోచాలా నమ్మకంగా ఉన్నారు.. విజువల్ తో కూడా నవ్వుతారని చెబుతున్నారు.. అంత నమ్మకం ఎలా వచ్చింది ?
ముంబైలో ప్రివ్యూ చూసినప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు. సినిమా చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకున్నారు. యూనిక్ రైటింగ్, మేకింగ్ తో నవ్విస్తున్నాం. ఖచ్చితంగా ప్రేక్షకులు పైసా వసూల్ అని ఫీలవుతారని నమ్మకం వుంది.

వాస్తు పాత్రకు టూరెట్ సిండ్రోమ్ పెట్టారు కదా.. దాని ద్వారా ఏదైనా సందేశం ఇవ్వాలని భావించారా ?
ఏదైనా వైకల్యం ఉంటే దాని గురించి ప్రొటెక్ట్ చేస్తూ మాట్లాడటం కాదు.. వారికి సాధికారత ఇచ్చే విధంగా ఉండాలనేది నా ఆలోచన. ఇందులో అంతర్లీనంగా ఆ సందేశం ఉంటుంది.

మీరు రాసుకునే పాత్రల్లో మీకు దగ్గరగా ఉండే పాత్రలు ఏమిటి ?
ప్రతి పాత్రల్లో ఎంతో కొంత నాకు నేను కనిపిస్తాను. కానీ ఇందులో నాయుడు పాత్ర రాసినప్పుడు నాలో ఉండే భారం తగ్గిపోయినట్లు అనిపించింది. అది నేను అనుభవించాను. నాయుడు పాత్రలో నాకు నేను కనిపించాను.

ట్రైలర్ లో చైనా బొమ్మ కనిపిస్తుంది.. దాని నేపథ్యం ఏమిటి ?
నాకు తెలిసిన ఒక మెడికల్ రిప్రజెంటర్ వున్నారు. ఆయన ఒక సిమ్యులేటర్ ని కార్ లో పెట్టుకొని పెళ్లి సంబంధానికి వెళ్ళారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు కార్ ని ఆపి ఆ సిమ్యులేటర్ ఏమిటని ప్రశ్నించారు. దీంతో రోడ్డు మీద దాని పనితీరు చూపించాల్సి వచ్చింది. అది చూసి పెళ్లి వాళ్ళు మ్యాచ్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది చాలా ఆసక్తికరమైన సంఘటన అనిపించింది. దానిని స్ఫూర్తిగా తీసుకోవడం జరిగింది.

పాత్రలు రాసుకున్నప్పుడు మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది ?
జీవితాన్ని ప్రతి కోణం నుంచి చూడాలని రైటింగ్ నేర్పించింది. ప్రతి పాత్రలోకి వెళ్లి ఆలోచించడం అవసరం. ప్రతి పాత్రలో లోతుగా ఆలోచించినప్పుడు ఒక హ్యుమానిటీ ఉంటుంది. సినిమా, జీవితం.. ఈ రెండిట్లో ఒక సానుభూతితో వుంటే లైఫ్ ఇంకా మెరుగ్గా ఉంటుంది. సినిమాలో చూపించిన పాత్రలతో మనుషులు మారుతారని నా నమ్మకం.

పోస్టర్ లో చైతన్యని ఎక్కువ చూపిస్తున్నారు .. ఇతనేనా హీరో ?
ఇందులో మొత్తం ఎనిమిది పాత్రలు ఉన్నాయి. అందులో హీరో ఎవరనేది నేను మా రైటింగ్ టీం బెట్ వేసుకున్నాం. ఆడియన్స్ ఎవరిని హీరో అంటారో అని. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్.( నవ్వుతూ)

మీ దర్శకత్వంలో మీరు నటిస్తున్న మొదటి సినిమా ఇది.. మీరే హీరో అనుకోవచ్చా ?
అలా ఐతే కేవలం నా ఫోటోనే వేసుకుంటాను కదా( నవ్వుతూ) అయితే నేను రాసిన పాత్రల్లో నాయుడు నా ఫేవరేట్.

సినిమా నిడివి కేవలం రెండు గంటలే వుంది కదా ?
అవును.. రాసుకున్నపుడు, తీసినప్పుడు కూడా రెండు గంటల ఇరవై నిమిషాలు వచ్చింది. పదిహేను నిమిషాలు ట్రిమ్ చేశా, క్రైమ్ కామెడీ నేచర్ క్రిస్పీగా ఉండటం, నెరేటివ్ పరిగెడుతూనే ఉంటుంది. కీడాకోలా కూడా ఫాస్ట్ పేస్ట్ అండ్ యూనిక్ గా ఉంటుంది.

గతంలో వెంకటేష్ గారితో ఒక సినిమా అనుకున్నారు కదా ?
అవును. ఆ సినిమా ఉంటుంది. సురేష్ బాబు గారు ప్రొసీడ్ అవ్వమన్నారు. అయితే కథ కోసం మరింత సమయం తీసుకున్నాను. ఇప్పుడు సిద్ధంగా వున్నాను, అలాగే ఒక వెబ్ సిరీస్ కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Keedaa Cola film
  • Keedaa Cola Movie
  • Tharun Bhascker
  • Tharun Bhascker Interview

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Israel-Khamenei: ఖమేనీ జాడను ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది? వెలుగులోకి సంచలన విషయాలు

  • Yadadri Bhuvanagiri: నా చావుకు వారే కారణం.. ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వివాహిత..!

  • IND Playing 11 vs ENG: ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్‌.. భారత జట్టులో కీలక మార్పు, ఆ స్టార్ ప్లేయర్ అవుట్!

  • హోలీ కానుకగా.. ‘కాంచన’ మూవీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

  • Mohammad Amir: ఛీ.. మీ వక్ర బుద్ది మారదా? భారత్ పై నోరుపారేసుకున్న పాకిస్తాన్ ప్లేయర్.!

ట్రెండింగ్‌

  • రూ. 4,000 డిస్కౌంట్‌తో పాటు ఉచిత ఇయర్‌బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • మరింత పవర్, మెరుగైన పనితీరు.. iPad Air (8th Gen) లాంచ్.. ధర ఎంతంటే?

  • Holi: చెడుపై మంచికి జయం.. భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ..!

  • Apple iPhone 17e లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions