NTV Telugu Site icon

Director Tatineni Rama Rao Passes Away : టాలీవుడ్ లో మరో విషాదం

T Rama Rao1

T Rama Rao1

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఏప్రిల్ 19న ప్రముఖ సీనియర్ నిర్మాత, ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ దాస్ నారంగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ విషాదంలో నుంచి తెలుగు చిత్రసీమ బయటపడక ముందే మరో సీనియర్ దర్శకుడు తుదిశ్వాస విడిచారు. అలనాటి ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఈరోజు ఉదయం అనారోగ్యంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : The Warrior : “బుల్లెట్” సాంగ్ పై రాక్ స్టార్ ఫస్ట్ రివ్యూ

1938 న‌వంబ‌ర్ 10న కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం జన్మించారు తాతినేని. 1950లలో తన కజిన్ అయిన టి.ప్రకాశరావు, కోటయ్య ప్రత్యాగాత్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన తాతినేని… 1966లో వచ్చిన ప్ర‌సాద్ ఆర్ట్ పిక్చ‌ర్స్ “నవరాత్రి” చిత్రంతో దర్శకునిగా కెరీర్ ను ప్రారంభించారు. ఇక ఆయన 1966 నుంచి 2000 మధ్య ఎక్కువగా సినిమాలు చేయగా, హిందీ, తెలుగు భాషల్లో కలిపి 80 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. హిందీలో అత్య‌ధిక చిత్రాలు తెర‌కెక్కించిన తెలుగు ద‌ర్శ‌కుడిగా రామారావు హిస్టరీ క్రియేట్ చేశారు. ఏయ‌న్నార్ తో “న‌వ‌రాత్రి, బ్ర‌హ్మ‌చారి, సుపుత్రుడు, రైతుకుటుంబం, దొర‌బాబు, ఆలుమ‌గ‌లు, శ్రీ‌రామ‌ర‌క్ష‌ వంటి చిత్రాలు తీసిన తాతినేని రామారావు… య‌న్టీఆర్ తో య‌మ‌గోల‌, ఆట‌గాడు, అనురాగ‌దేవ‌త‌ తదితర చిత్రాలు తీశారు.

శోభన్ బాబుతో జీవ‌న‌త‌రంగాలు, ఇల్లాలు, బాల‌కృష్ణ‌తో ప్రెసిడెంట్ గారి అబ్బాయి, త‌ల్లిదండ్రులు మొదలైన సినిమాలు చేశారు. ఇక ‘య‌మ‌గోల‌’ రీమేక్ `లోక్-ప‌ర‌లోక్`తో హిందీలోకి దర్శకుడిగా అడుగు పెట్టారు. ఆ తరువాత హిందీలో అనేక చిత్రాలు రూపొందించిన తాతినేని రామారావు ‘అంధా కానూన్’తో రజినీకాంత్ ను బాలీవుడ్ కు పరిచయం చేశారు. క‌మ‌ల్ హాస‌న్ తో ‘యే తో క‌మాల్ హోగ‌యా’, జితేంద్ర, మిథున్ చ‌క్ర‌వ‌ర్తితో పలు హిందీ సినిమాలు తెరకెక్కించారు. అమితాబ్ బ‌చ్చ‌న్ తో `అంధా కానూన్, ఇంక్విలాబ్` చిత్రాలను తీశారు. ఇక తెలుగులో తాతినేని రామారావు చివ‌రి చిత్రం `గోల్ మాల్ గోవిందం`, హిందీలో `బేటీ నంబ‌ర్ వ‌న్`.

Show comments