Site icon NTV Telugu

Virupaksha: ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్న స్టార్ డైరెక్టర్

Virupaksha

Virupaksha

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. థ్రిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలని చూడడానికి ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు. కథలో కొత్తదనం, కథనంలో ఆసక్తిని మైంటైన్ చేస్తే చాలు ఏ థ్రిల్లర్ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. విరూపాక్ష ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే కొత్తగానే కాబట్టి ఏప్రిల్ 21న సాయి ధరమ్ తేజ్ ఖాతాలో మంచి హిట్ పడే ఛాన్స్ ఉంది. అజ్నీష్ లోకనాథ్ మ్యూజిక్ విరూపాక్ష సినిమాని బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలవనుంది. వచ్చే శుక్రవారం రిలీజ్ కానున్న విరూపాక్ష సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు ఏలూరులోని ‘సిఆర్ రెడ్డి’ కాలేజ్ లో సాయంత్రం ఆరు గంటల నుంచి జరగనుంది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్, విరూపాక్ష సినిమా ప్రెజెంటర్ సుకుమార్ అటెండ్ అవ్వనున్నాడు.

ఇదిలా ఉంటే విరుపాక్ష సినిమాని తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ ప్రతి పోస్టర్ లో వేస్తున్నారు కానీ ప్రమోషన్స్ మాత్రం తెలుగులోనే చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల బౌండరీలు దాటి విరూపాక్ష ప్రమోషన్స్ ని ఎందుకు చెయ్యట్లేదు? అదర్ లాంగ్వేజ్ రిలీజ్ నుంచి వెనక్కి తగ్గారా లేక టైం లేదని ఇక్కడ మాత్రమే ప్రమోషన్స్ చేస్తున్నారా అనేది చూడాలి. ఇప్పటికైతే సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై ఆడియన్స్ లో పాజిటివ్ ఒపినియన్ ఉంది. మరి ఏప్రిల్ 21న తేజ్ ఎలాంటి రిజల్ట్ ని రాబడుతాడు అనేది చూడాలి.

Exit mobile version