Hello Meera: ఒకే పాత్రతో గంటన్నర వినోదం! డైరెక్టర్ శ్రీనివాస్ సాహసం!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakarla Srinivas: భారీ భారీ డైలాగులు, అట్రాక్ట్ చేసే డ్యూయెట్స్, ఔరా అనిపించే ఫైట్ సీన్స్.. సినిమా అనగానే ఇవేకదా మనకు గుర్తొచ్చేవి. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఎలాంటి ఫైట్స్, డ్యూయెట్స్ లేకుండా కేవలం సింగిల్ క్యారెక్టర్‌తో సినిమా తీయడమంటే అది గొప్ప సాహసమే అని చెప్పుకోవాలి. ఎంతో ధైర్యం, కథపై నమ్మకం ఉంటే తప్ప అలాంటి సినిమా తీయడానికి ఏ దర్శకుడు ముందుకు రాలేడు. కానీ అదే చేసి చూపించారు డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస్. సినిమా అంటే వ్యామోహం.. సినిమానే జీవితం అన్నట్లుగా ముందుకు వెళుతున్న కాకర్ల శ్రీనివాస్ ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ.. తెరవెనుక ఉండి ఎన్నో సినిమాలను విజయ తీరాలకు చేర్చిన ఘనత ఆయన సొంతం. ప్రఖ్యాత దర్శకులు బాపు దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన కాకర్ల శ్రీనివాస్ ఆయన చివరి సినిమా ‘శ్రీరామరాజ్యం’ వరకు నీడలా ఆయన వెంటే ఉన్నారు. తనలోని టాలెంట్ బాపు గారితో పంచుకుంటూ గొప్ప సినిమాలకు తెర రూపమిచ్చారు.
అదే అనుభవాన్ని రంగరిస్తూ తన టాలెంట్ నేరుగా బయటపెట్టడానికి ‘హలో మీరా’ అనే సినిమాను కాకర్ల శ్రీనివాస్ రూపొందించారు. కేవలం ఒకే ఒక్క క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. కోట్ల సంపద లేకున్నా మెదడులో దాగి ఉన్న పదునైన ఆలోచనలతో డిఫరెంట్ స్టోరీ రాసుకొని ‘హలో మీరా’ అనే క్యాచీ టైటిల్ తో ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. సింగిల్ క్యారెక్టర్ తో సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ వెండితెరపై పండించడం అంత సులువు కాదు. కానీ తన కథ పట్ల తనకున్న అపారమైన నమ్మకంతో అలాంటి సాహసం చేస్తూ ప్రయోగాత్మక సినిమా తీశారు. వైవిద్యభరితమైన కథలో ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి రెడీ అయ్యారు. తెరపై కేవలం ఒక అమ్మాయిని మాత్రమే చూపిస్తూ సగటు ప్రేక్షకుడి బుర్రలో బోలెడు రోల్స్ మెదిలేలా ఈ సినిమాను తెరకెక్కించడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. తెరపై కనిపించేది మీరా అనే అమ్మాయే అయినా వినిపించే పాత్రలన్నీ సగటు ప్రేక్షకుడి మదిలో మెదిలేలా రూపొందించారు. ప్రేమ, స్నేహం, స్నేహితుల కోసం దెబ్బలు తినడం, మీడియా సమావేశంలో గొడవలూ, రౌడీయిజాలూ, కొట్లాటలూ, టీవీలో బ్రేకింగ్ న్యూస్ అన్నీ ప్రేక్షకుడి కళ్ల ముందు కదలాడేలా జాగ్రత్త పడ్డారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన కొందరు ప్రముఖులు కాకర్ల శ్రీనివాస్ ప్రతిభను కొనియాడుతున్నారు. సినిమా అంటేనే కమర్షియల్ ఎలిమెంట్స్ అనుకుంటున్న ఈ రోజుల్లో గొప్ప సినిమా తీశారని, ఆడియో విజువల్ టెక్నాలజీలో తీసిన ఈ ‘హలో మీరా’ సినిమా ప్రేక్షకులకు ఎన్నడూ లేని విభిన్న అనుభూతిని కలిగిస్తుందని అంటున్నారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్‌లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు