NTV Telugu Site icon

Aishwarya Shankar: భర్తతో విడాకులు.. ఇప్పుడు తండ్రి అసిస్టెంట్ తో శంకర్ కూతురి ఎంగేజ్మెంట్

Shankar Daughter

Shankar Daughter

Director Shankar’s daughter Aishwarya gets engaged to Tarun Karthik: దర్శకుడు శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య శంకర్ కి తన తండ్రి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న తరుణ్ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తరుణ్ కార్తీక్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇక శంకర్ చిన్న కూతురు, అదితి శంకర్ ఆ సంతోషకరమైన ఫోటోలను పంచుకున్నారు. ఆదివారం, ఐశ్వర్య – తరుణ్ నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ జంట సోషల్ మీడియాలో ఫొటోలలో సంతోషంగా కనిపించారు. ఇక ఐశ్వర్య తన చీరకట్టులో భారీ బంగారు ఆభరణాలను ధరించగా, తరుణ్ తెల్లటి దుస్తులు ధరించి కనిపిస్తున్నాడు. ఇక అదితి శంకర్ శనివారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో “వారు నిశ్చితార్థం చేసుకున్నారు” అని రాసుకొచ్చారు. ఐశ్వర్య ఇంతకుముందు జూన్ 2021లో ఒక వ్యాపారవేత్త కుమారుడు, క్రికెటర్ రోహిత్‌ను వివాహం చేసుకుంది.

Rashmika Mandanna: చావు నుంచి తప్పించుకున్నానన్న రష్మిక.. అసలు సంగతి చెప్పిన ఎయిర్ లైన్స్ ప్రతినిధులు

ఇది కోవిడ్ -19 మహమ్మారి సమయంలో జరిగినందున, శంకర్ వివాహాన్ని మహాబలిపురంలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో చాలా రిచ్ గా నిర్వహించాడు. ఇక అప్పట్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సహా పలువురు ముఖ్యులు హాజరయ్యారు. ఐతే కొన్నాళ్ల క్రితం క్రికెట్ కోచ్ తామరై కన్నన్‌పై 16 ఏళ్ల బాలిక లైంగిక వేధింపుల కేసు పెట్టడంతోఆ రోహిత్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో రోహిత్ కూడా ప్రమేయం ఉన్నాడని టాక్. మే 2022లో చిత్ర పరిశ్రమను ఆహ్వానించేందుకు భారీ రిసెప్షన్‌ని ప్లాన్ చేస్తున్న దర్శకుడు శంకర్ హఠాత్తుగా రిసెప్షన్‌ను రద్దు చేశాడు. కారణం గురించి ఎటువంటి సమాచారం లేదు, కానీ పోస్కో కేసులో రోహిత్ ప్రమేయం కారణంగా ఇది జరిగిందని వార్తలు వచ్చాయి. ఇక ఆ తరువాత వారికి విడాకులు అవడంతో ఇప్పుడు కార్తీక్ ను వివాహం చేసుకున్నాడు.

Show comments