NTV Telugu Site icon

Director Died: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి

Sangeeth Sivan Died

Sangeeth Sivan Died

Director Sangeeth Sivan Death: బాలీవుడ్‌కి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు సంగీత్ శివన్ బుధవారం మరణించారు. సంగీత్ శివన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సంగీత్ శివన్ వయసు కేవలం 65 ఏళ్లు మాత్రమే. సంగీత్ శివన్ మృతికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. దర్శకుడు శివన్ మృతి పట్ల బాలీవుడ్ సహా సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. బాలీవుడ్‌కి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన సంగీత శివన్ ‘క్యా కూల్ హై హమ్’, ‘అప్నా సప్నా మనీ మనీ’ వంటి కామెడీ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఇప్పుడు శివన్ మరణ వార్తతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. శివన్ మృతి పట్ల బాలీవుడ్ స్టార్ రితీష్ దేశ్‌ముఖ్ సంతాపం వ్యక్తం చేశారు. సంగీత్ శివన్ మృతి పట్ల బాలీవుడ్‌తో పాటు సినీ తారలందరూ సంతాపం వ్యక్తం చేశారు.

Kishan Reddy: సికింద్రాబాద్, అంబర్ పేట లో కిషన్‌ రెడ్డి పర్యటన.. షెడ్యూల్‌ ఇదీ..

రితేష్ దేశ్‌ముఖ్ తన సోషల్ మీడియాలో శివన్ చిత్రాన్ని పంచుకుంటూ ఎమోషనల్ నోట్ రాశారు. సంగీత శివన్ సౌత్ సినిమాలో కూడా ఎన్నో సినిమాలు చేశారు. మలయాళ సినీ పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన సంగీతా శివన్ బాలీవుడ్‌కి కూడా హిట్ సినిమాలు అందించాడు. ఇక సంగీత్ రఘువరన్ నటించిన వ్యూహం (1990)తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. 1997లో సన్నీడియోల్ నటించిన ‘జూర్’ సినిమాతో బాలీవుడ్‌లో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ఇక ఆ అనంతరం బాలీవుడ్లో సంధ్య, చురలియా హై తుమ్నే, క్యా కూల్ హై తుమ్, అప్నా సప్నా మణి మణి, ఏక్ – ది పవర్ ఆఫ్ వన్, క్లిక్ మరియు యమ్లా పగ్లా దీవానా 2 అనే హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సౌత్ సినిమాతో పాటు బాలీవుడ్‌లో కూడా శివన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. శివన్ మృతితో బాలీవుడ్, మలయాళ చిత్రసీమలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Show comments