Bheemla Nayak: పవన్ ‘బాగా తీయ్, బాధ్యతగా చేయ్’ అన్నారు: సాగర్ చంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ దర్శకుడు సాగర్ కె చంద్ర తన అనుభవాలను సోమవారం మీడియాతో పంచుకున్నారు. ఇది మలయాళ రీమేక్ అయినా ఈ మూవీని చూసి వారే మళ్ళీ దీనిని రీమేక్ చేసేలా తాము మార్పులు, చేర్పులూ చేశామన్నారు. పవన్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయిన తర్వాత దాని స్పాన్ పెరిగిందని, అలాంటి సమయంలో త్రివిక్రమ్ గారు ఇచ్చిన సజెషన్స్ ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. రచయితగా, దర్శకుడిగా ఆయన సీనియారిటీ తమందరికీ ప్లస్ అయ్యిందని చెప్పారు. ఆయన సహకారం లేకపోతే చిత్రం ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదని తెలిపారు. సినిమా షూటింగ్ ఆరంభానికి ముందు ‘వకీల్ సాబ్’ సెట్ లో పవన్ కళ్యాణ్ కలిసి మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకుంటూ, ”అప్పుడు కోర్టు రూమ్ సీన్స్ తీస్తున్నారు. వన్ టూ వన్ ఆయనతో మాట్లాడాను. ‘బాగా తీయ్.. బాధ్యతగా పని చేయ్’ అని చెప్పారు. ఆ మాటలను మనసులో పెట్టుకుని, అంతా ఎనర్జీతో పని చేశాం. ఆ తర్వాత జర్నీ అంతా అందరికీ తెలిసిందే” అని అన్నారు.
ఇంతవరకూ తాను దర్శకత్వం వహించిన మూడు చిత్రాల గురించి సాగర్ కె చంద్ర తెలియచేస్తూ, ”తొలి చిత్రం ‘అయ్యారే’ సమయంలో సినిమా తీయాలనే తపన తప్ప ఇంకేం తెలీదు. ప్రొడక్షన్ ఎలా చేయాలి? ఎలా ముందుకెళ్లాలి? అనే సంగతి తెలీదు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ టైమ్ కు పరిచయాలు పెరిగాయి, కొంత అవగాహన వచ్చింది. ఒక అడుగు ముందుకెళ్లేలా చేసింది. ఇక తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ నన్ను మరో మెట్టు ఎక్కించింది. ఈ మూడు సినిమాల వల్ల నాకు మంచే జరిగింది” అని చెప్పారు. ఈ సినిమా విజయంతో అందుతున్న ప్రశంసల గురించి మాట్లాడుతూ, ”ఒక సినిమా సక్సెస్ అయితే ‘తెలిసినవాళ్లు.. తెలియనివాళ్లు ఫోన్లు చేసి ప్రశంసిస్తున్నారు’ అని సినిమా టీమ్ చెబుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది. వీళ్ల నంబర్ జనాలకు ఎలా తెలుసని నవ్వుకునేవాడిని. ఇప్పుడు దానికో లాజిక్ ఉందని అర్థమైంది. తాజాగా ఆ అనుభవం నాకు ఎదురైంది. చాలామంది ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారు. సినిమా చూసి సుకుమార్, హరీశ్ శంకర్, సురేందర్ రెడ్డి, క్రిష్ వంటి దర్శకులు ఫోన్ చేసి కమర్షియల్ హిట్ కొట్టావ్ అని చెబుతుంటే ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు. త్వరలోనే ‘భీమ్లా నాయక్’ హిందీలోనూ విడుదల కాబోతోందని చెప్పారు.
Also Read
నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెబుతూ, ” ‘భీమ్లా నాయక్’ సినిమా కంటే ముందు వరుణ్‌తేజ్‌తో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో ఓ సినిమా ప్రకటించారు. అనుకున్న బడ్జెట్ దాటడంతో అది పక్కకు వెళ్లింది. తర్వాత ఆ కథతో చేస్తానా.. ఇంకోటి చేస్తానా అన్నది చూడాలి” అని అన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!