NTV Telugu Site icon

RGV: స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కి కూడా నవ్వాలో, ఏడవాలో అర్ధం కాని పరిస్థితి

Rgv

Rgv

విజయవాడలో ఎన్టీఆర్ విఙ్ఞాన ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి సభ ఏర్పాటు చేసారు. ఈ సభకి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహనుడు గురించి రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. “నేను ఇక్కడకు మీ అందరికీ ఒక జోక్ చెప్పటానికి వచ్చాను. రాజమండ్రిలో ఈ జోక్ జరుగుతోంది. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ కూడా నవ్వాలో, ఏడవాలో అర్ధం కాని పరిస్థితి. చంద్రబాబు ఎలాంటి వాడో ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు. లక్ష్మి పార్వతి మాయలో ఎన్టీఆర్ పడ్డారు అంటే ఎన్టీఆర్ కు అవగాహన లేదా?? అవగాహన లేని వ్యక్తికి దండలు ఎందుకు వేస్తున్నారు? రజనీకాంత్ చంద్రబాబు పక్కన కూర్చుని ఎన్టీఆర్‌ను ఇవాళ పొగడటం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవటమే. ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళతో పాటు వేదిక పంచుకోకుండా ఒక విధానానికి కట్టుబడ్డాడు జూనియర్ ఎన్టీఆర్” అంటూ రామ్ గోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.

Read Also: Hrithik Roshan: ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నా…