Director Rajkumar Kohli’s Birthday : భారీ చిత్రాల రాజ్ కుమార్ కోహ్లి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవాతీత శక్తులతో కథలు రూపొందించి చిత్రాలు తెరకెక్కించి విజయాలు సాధించాలని ప్రస్తుతం బాలీవుడ్ తహతహలాడుతోంది. రణబీర్ కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ అందుకు ఓ తాజా ఉదాహరణ. గతంలో ఎన్నో సూపర్ న్యాచురల్ పవర్స్ తో బాలీవుడ్ సినిమాలు రూపొంది ఘనవిజయం సాధించాయి. ఓ దశలో వరుసగా ఆ తరహా చిత్రాలతో అలరించారు దర్శక నిర్మాత రాజ్ కుమార్ కోహ్లి. ఆ నాటి మేటి హీరోలతో సినిమాలు రూపొందించి హిందీ చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు రాజ్ కుమార్ కోహ్లి. సెప్టెంబర్ 14న రాజ్ కుమార్ కోహ్లి 92 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు.
రాజ్ కుమార్ కోహ్లి 1930 సెప్టెంబర్ 14న జన్మించారు. సినిమాలపై ఆకర్షణ పెంచుకొని ముంబై బాట పట్టారు. ఆరంభంలో కొన్ని సినిమాలకు అసోసియేట్ గా పనిచేస్తూ చిత్ర నిర్మాణాన్ని పరిశీలించారు. తరువాత తానే నిర్మాతగా మారి “పిండ్ ది కుర్హి, మై జట్టీ పంజాబ్ ది, దుల్లా భట్టి” వంటి పంజాబీ చిత్రాలు నిర్మించారు. తరువాత హిందీ, పంజాబీ భాషల్లో ‘డంకా’ అనే సినిమాను తెరకెక్కించారు. ఇందులో దారాసింగ్ కథానాయకుడు. ఈ సినిమాలోనూ అంతకు ముందు రాజ్ కుమార్ కోహ్లి నిర్మించిన పంజాబీ చిత్రాల్లోనూ నాయికగా నటించిన నిషి తరువాతి రోజుల్లో కోహ్లి భార్య అయ్యారు. రాజేంద్ర కుమార్ ద్విపాత్రాభినయంతో కోహ్లి నిర్మించిన ‘గోరా ఔర్ కాలా’ 1972లో విడుదలై ఘనవిజయం సాధించింది. 1973లో కోహ్లి దర్శకునిగా మారి ‘కహానీ హమ్ సబ్ కీ’ అనే చిత్రం రూపొందించారు. మాలా సిన్హా, వినోద్ మెహ్రా నటించిన ఈ సినిమా ఆకట్టుకుంది. 1972లోనే శత్రుఘ్న సిన్హా హీరోగా ‘మిలాప్’ అనే హిందీ చిత్రం రూపొంది మంచి విజయం సాధించింది. అందులో శత్రుఘ్న సిన్హా ద్విపాత్రాభినయం చేశారు. ఓ పాత్ర పాముగా మారుతుంది. ఆ సినిమాలో రీనా రాయ్ నాయిక. ‘మిలాప్’ జనాదరణ పొందడంతో రాజ్ కుమార్ కోహ్లి కూడా ఆ తరహా కథను తయారు చేసుకొని ‘నాగిన్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రీనా రాయ్ నాగకన్యగా నటించారు. ఆమెకు జోడీగా నాగరాజు పాత్రలో జితేంద్ర కనిపించారు. ఈ సినిమాలో సునీల్ దత్, ఫిరోజ్ ఖాన్, వినోద్ మెహ్రా, సంజయ్ ఖాన్, కబీర్ బేడీ, రేఖ, ముంతాజ్ వంటి స్టార్స్ నటించారు. తన జోడీ అయిన పామును చంపినవారిపై ఆడ నాగు పగబట్టి వారి ప్రాణాలు తీస్తూ, చివరకు ఆమెనే చనిపోవడంతో కథ ముగుస్తుంది. ఈ సినిమా విజయంతో రాజ్ కుమార్ కోహ్లి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ తరువాత నుంచీ రాజ్ కుమార్ కోహ్లి భారీ తారాగణంతో సినిమాలు తీయడంలో మేటి అనిపించుకున్నారు. అలా “ముఖాబ్లా, జానీ దుష్మన్, బద్లే కీ ఆగ్, నౌకర్ బివీ కా, రాజ్ తిలక్, జీనే నహీ దూంగా, ఇన్సానియత్ కే దుష్మన్” వంటి చిత్రాలు భారీ మల్టీస్టారర్స్ తెరకెక్కించి విజయం సాధించారు. ఈ చిత్రాలలో ఎక్కువగా రీనా రాయ్ నాయికగా నటించడం విశేషం! అలాగే ఆయన సినిమాల్లో సునీల్ దత్, ధర్మేంద్ర, జితేంద్ర, వినోద్ మెహ్రా వంటి స్టార్ హీరోస్ కూడా ఎక్కువగా కనిపించారు.
Also Read
- Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు... వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
- Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
- Mystery Crime Thriller OTT : కంటైనర్‌లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- Kollywood : రూట్ మార్చిన కోలీవుడ్ స్టార్స్.. మళ్లీ కమర్షియల్ జోన్లోకి సూర్య, విక్రమ్, ధనుష్, శివకార్తికేయన్!
తరువాతి రోజుల్లో సన్నీ డియోల్, అనిల్ కపూర్, మిథున్ చక్రవర్తి వంటి వారితో రాజ్ కుమార్ కోహ్లి చిత్రాలు రూపొందించారు. కానీ, అవేవీ అంతగా అలరించలేదు. చివరగా ఆయన ‘జానీ దుష్మన్: ఏక్ అనోఖీ కహానీ’ అనే సినిమా తీశారు. సన్నీ డియోల్, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి నటించిన ఈ సినిమా పరాజయం పాలయింది. 1992లో తన కొడుకు అర్మాన్ కోహ్లిని హీరోగా పరిచయం చేస్తూ ‘విరోధి’ అనే చిత్రం తెరకెక్కించారు. ఇందులో ధర్మేంద్ర, సునీల్ దత్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా వంటి వారు నటించారు. అయితే అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఏది ఏమైనా మల్టీస్టారర్స్ సినిమాలు, సూపర్ న్యాచురల్ పవర్స్ తో సాగే కథలు గుర్తుకు వచ్చిన ప్రతీసారి రాజ్ కుమార్ కోహ్లి పేరును బాలీవుడ్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం పరాజయాల బాటలో సాగుతున్న బాలీవుడ్ ను ఎలా మళ్ళీ విజయపథంలో పయనింప చేయాలని ఆలోచించేవారు కూడా రాజ్ కుమార్ కోహ్లిని గుర్తు చేసుకుంటున్నారు. మరి ఆయన స్ఫూర్తితో ఎవరు బాలీవుడ్ కు మల్టీస్టారర్ తో సక్సెస్ ఇస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Annamalai: బీజేపీకి గుడ్‌బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
-
TDP SIR Workshop: ఎస్ఐఆర్పై టీడీపీ ప్రత్యేక వర్క్‌షాప్.. కూటమి సమన్వయమే తొలి పరీక్ష!
-
Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు… వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
-
ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
-
Vaibhav Sooryavanshi: భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇక నుంచి డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!